పుట:Andhrula Charitramu Part 2.pdf/346

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గణపరిచక్రవర్తి మరణము జెందిన సంవత్సరమ్ననే యక్కడ దేవగిరిలో యాదవపభు వయిన కృష్ణభూపతి కూడ మరణము జెందెను. అతని సొదరుడగు మహాదేవరాజు పట్టాబిషిక్తుడయ్యెను.

     ఈ మహాదేవరాజు స్త్రీలను శిశువులను ఎప్పుడును జంపినవాడు కాడు గావున నీతడు పట్టాభిషిక్తుడయిన తోడనె యీతనిపరాక్రమమునకు భయపడి యాంధ్రు లొక్క యాడువారిని మాళవు లొక్కశిశువును సింహాసన మెక్కించిరని శాసనములలో గవులు గొనియాడియిండిరి. అస్తోత్ర పాఠముల కుబ్బి ప్రతాపవంతు డైన మహాదేవరాజు త్రిలింగదేశముపై దండెత్తిరా బ్రయత్నించెను. ఇంతలో రుద్రాంబాదేవి యూరుకొనక తన తండ్రివలన నీరాజ్యతంత్రజ్ఞానమును చక్కగాగ్రహించినది గావున నిసుమంతయుగాంకక యెంతమాత్రము నుపేక్షింపక శిధిలము లయిన దుర్గభాగముల నన్నిటిని బాగుచేయించి విశ్వాసపాత్రులయిన మంత్రిసేనాపతిసామంతభటవర్గమును రప్పించుకొని కోటల నన్నిటిని సురక్షితములుగ గావించెను.  ఏకశిలా నగరమునకు జుట్టును గపకోటనుగట్టించెను. దీనికి లోతట్టున మట్టికోటను గట్టించెను. దీని చుట్టును గొప్పయగడ్తను ద్రవ్వించెను.  భూమికోటకు గననులు 8 దియును, దెడ్లు 18 ను, పుట్టకోటకు గనమలు 4 ను, దిడ్లు8 దియును, రాతికోటకు గవనులు 4 ను దిడ్లు 8 దియును, రాతికోటకు లోతట్టున రాతిసొపానములును పెట్టించి అలంగముమీద తనబంధు వర్గములోని వీరణ్భటుల నుండనియమించి తక్కిన బంధువ్రము నంతయు రాతికోటకు లోతట్టున నున్న యిటుకకోటలో నుండ విధియించెను. కొమ్మ 1 కి ఇద్ద~!రును, బురుజు 1కి ఏబద్ండ్రును, దిడ్డి 1కి నూఱ్వురును, గనమ 1కి ఏనూఱ్వురును వీరభటులను గాపువెట్టెను. తన కొమార్తయై నౌక్కక్క కూత్రసంతానము లణ్భించుటకయి బుద్ధగణపతినారాధింప గొరి వడ్డపల్లెకును అటనుండి ఏకవీరామహాదేవిని గొలుచుటమై మొగలిచెర్లకును బొయి అయిదుదినము లచ్చట నున్న కాలమున హరిహరదేవుడును మురారి దేవుడును ఆమెకు బట్టుకొన బ్రయత్నించిరి. అప్పుదేర్ధియో యొక యుపాయమును బన్నితన కొమార్త యైన యమ్మక్కతో గూడ దప్పించు