పుట:Andhrula Charitramu Part 2.pdf/344

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రుద్రదేవరు మహారాజుల యల్లుండు మల్లదేవులు" అని వ్రాయబడి యుండుటను జూచి చాళుక్యబేతనిజయాదిత్యుని వంశములోనివాడై "మల్లపదేవచక్రవర్తి" "మల్లవిష్ణువర్దన మహారాజు" అను నామములతో వ్యవహరింపబడుచు క్రీ.శ.1202వ సంవత్సరము మొదలుకొని 1212వ సంవత్సరాంతమువఱకు వేంగీ దేశమున్ బరిపాలించిన మల్లపరాజే మల్లదేవులని యభిప్రాయపడి శ్రీరామమూర్తి పంతులుగారు గారు "ఓరుగంటి గణపతిరాజుల చరిత్ర" మనుపేరిట నాంగ్లేయ భాషలో వ్రాసినయొక చిన్నగ్రంధములో కాకతిరుద్రదేవిభర్త చాళుక్యమల్లప దేవచక్రవ్చర్తియని నుడివియున్నారు. ఆశాసనములో నుదాహరింపబడిన సంవత్సరము వారి సిద్ధాంతమునకు ప్రతిబంధకంగా నున్నది.

     శా.శ.1097 వ సంవత్సరమనగా క్రీ.శ. 1175 దవ సంవత్సరమునం దాశాసనము ఉట్టినదగుటచేత, అప్పటికి మల్లదేవుని భార్యయగు రుద్రదేవనికి కనీసము 15 సంవత్సరములు వయ స్సుండవలయును.రుద్రదేవి క్రీ.శ.1260 దవ సంవత్సరమున రాజ్య్హభారము వహించి 1295 వఱకు బరిపాలనము చేసి నందున మరణకాలము నాటికి 135 సంవత్సరములును, గణపతిదేవ చక్రవర్తి 125 సంవత్సరములును బ్రతికి యుండెనని చెప్పవలసి వచ్చును. అట్లు చెప్పుట సరియైన పద్దతికాదు. కాకతిగణపతి రుద్రుని యల్లుడని చెప్పినంత మాత్రమున నాతడు రుద్రాంబిక భర్తయని యెట్లు నిర్దారింపనగును? గణపతి చక్రవర్తికి రుద్రాంబిక యను నొక్కకూతురు మాత్రమే గలదని చెప్పుటకును సాధ్య పడదు. గణపాంబ యను కొమార్త మఱియొకతె గలదని ధాన్యకటక శాసనమున జెప్పబడి యుండలేదా? ఇంకను కూతురుఱులు లేరని యెట్లు సిద్దాంతీకరింప వచ్చును? ఇంతియగాక గణపతికొడుకను రుద్రదేవుడని చెప్పదగునా? గణపతి రుద్రదేవు డను నామము గలదని మఱియెక్కడను గానంబడలేదు. మొదటి ప్రతాపరుద్రుడని యర్ధము చేసికొందమన్నను ఆ ప్రతాపరుద్రుని తండ్రి ప్రోలరాజు గాని గణపతి కాడు.