పుట:Andhrula Charitramu Part 2.pdf/340

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఈ భావమె పైన నుదాహరించిన శ్లోకములలోను వాక్యమ్లలోను స్పష్టము గా గనుపట్టుచున్నది. దీనిం బట్టి వ్యాఖ్యాత చెప్పిన విధముగా రుద్రాంబిక తండ్రి కాకతి గణపతిదేవచక్రవర్తి గాక మఱియొక గణపతి యని యూహించుటకు ననువు పడునా! అట్లయినయెడల కాకతి సామ్రాజ్యము భర్త యైన కాకతి గణపతిచక్రవర్తివలన గాక తండ్రియైన గణపతివలన రుద్రాంబికను సంక్రమించిన దని చెప్పవలసి వచ్చును. అది చరత్రాంశమునకు విరుద్ధ మని యెఱుంగుదుము. కనుక పైసంభాషణముల యందలి భావమువలన కాకతి గణపతిచక్రవర్తికి రుద్రాంబిక కూతురనియును, పుత్త్రులు లేని కారణమున నామెను పుత్త్రునిగా జూచుకొనుచు నామెకు రుద్రదేవుడనియె పురుష నామ ముంచెనని విస్పష్టమగుచున్నది. శ్రీరామమూర్తిగారు కవిజీవితములయందు మొదట తక్కినవారివలెనెభ్రమపడి భార్యయని వక్కాణించి ;యున్నమాట వాస్తవమెగాని తరువాత పైనిజెప్పిన విధముగా గనబఱిచి పుత్త్రికయని సిద్ధాంతము చేసియున్నారు. ఇట్లని యెఱుంగక వెలుగోటివారి వంశచరిత్రము నందు భార్య యని కవిజీవితములయందు వ్రాసిన వాక్యములు ప్రమాణములు గానెత్తి చూపబడినవి గావున నయ్యని నిస్ప్రయోజనములు. డాక్టరు హాల్ ట్జు గారు గాని శ్రీరామమూర్త్రిగారు గాని శాసనప్రమాణ మేమియు జూపినవారు కారు. రాబర్టు మ్య యల్ గారు మాత్రము గుంటూరుమండలములో కాకాని గ్రామములో నొక శాసనము గల దని నుడివి యందును గూర్చి యిట్లు వ్రాసియున్నారు.1

       "ఓరుగంటి రుద్రమహాదేవి రాజ్య పరిపాలన కాలమున శా.శ.1192 క్రీ.శ. 1270 సంవత్సరములో కృష్ణామండలములోని (ప్రస్తుతము గుంటూరు) గ్రామములో గోపాలస్వామి గుడ్కి నెదుట నొక శిలాశాసనము గలదు. కాకతి గణపతి దేవుని కూతు తని చెప్పబడినది కావున నీ శాసనము మిక్కిలి ముఖ్య మయినదిగా నున్నది.

1.Lists of Antiquities Vol. I, Pp.74 and 75