పుట:Andhrula Charitramu Part 2.pdf/339

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

   శ్లో. సైవోమా చేతి నిర్ధిష్టా సోమాచేతి ప్రధా మగాత్
       తన మాతా శివా సాక్షా ద్దేవో గణపతి: పితా"
       మంత్రిణ:--ఏన మే వైతత్, అన్యధాకధమీశ్వరస్వ ప్రసాదౌదృతే
       నిరంకుశం స్త్రీవ్యక్తివిశేషస్య లోకాధిపత్యం | ఏషం మానుషశంభునా
       గణపతిమహారాజేన అభ్యంతర స్యానుభవమహిమ్న: సదృశ మత్ర
       పుత్త్ర ఇతి వ్యవహార: కృత: | తదనుగుణా అ రుద్ర ఇతీ వ్యవహార:
       కృత: | తదనుగుణాన రుద్రఇ త్యాభ్యా"

    "రాజా (పురుష వేషంతొ నున్న రుద్రాంబిక) రంగస్థలమునకు "నేతెంచి కాకతీయులకు కులదేవు డయిన స్వయంభూదేవుడు భవిష్యత్కాలమున నెట్లు రాజ్యపరిపాలనము నిర్వైంపవలయు నో ఉపదేశ మిచ్చుటకై తనస్వప్నములో సాక్షాత్కరించె నని చెప్పెను.
     అంతట పురోహితుడు "నీవంటిప్రజలుమాత్రమే స్వయంభూదేవుని సాక్షాత్కారమును ఉపదేశమును బొందుటకు నర్హులనియు, అట్టిరి కుమారునని తండ్రి చేయవలసిన విధ్యుక్తధర్మములలో నొక్కటి గావున నందు నూత్న విశేస మేమియును లేదనియును, నీతండ్రికి గణపతి యనియు నామము లుండుటచేత స్వయంభూదేవుని (అర్ధనారీశ్వరుని యొక్క యొక యాకృతి) సంతాన మనిపించుకొనుటకు నీకు సత్త్వము గలదనియు" ప్రత్యుత్తరము చెప్పెను. 
     అటుపిమ్మట మంత్రి "అట్లు కాదేని నిరంకుశాధికారముగల యొకమహా రాజువలె నొక స్త్రీదేశమును బరిపాలించుట యెట్లు సాధ్య మగును కనుకనే ఈశ్వరాంశసంభూతుడైన గణపతిమహారాజు తనదివ్యజ్ఞానంచేత తనను జనించి యుండిన బిడ్డ దేశపాలనము చేయుటకుం దగిన గుణవిశేషములు గలిగి యున్నదని తెలిసికొని లోకవ్యవహారముకొఱకు కుమారుండనియే ప్రకటించి రుద్రదేవు డని నామకరణముచేసె" నని చెప్పి పై పురోహితుని యభిప్రాయము ను బలపఱిచెను.