పుట:Andhrula Charitramu Part 2.pdf/341

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అని వ్రాసిఉన్నారు కాని శాసనమును జక్కగా పరిశీలించి దాని ప్రతి నెత్తికొని వివరముగా వ్రాఉట కాయన శ్రద్ధతీసికొని యుండలేదు కనుక నందేమి కలదో యింతవరకు నెవ్వార్ను జెప్పియుండలేదు.

              వెలుగోటివారివంశచరిత్రము ప్రాతగ్రంధమునందు
      "గీ. ఘనత నాప్రసాదిత్యుండు కాకతిగణ
           పతి చనిన నతని సుతకు బట్టణంబు
           రమణతో గట్టి కాకతి రాయరాజ్య
           స్థాపనాచార్య బిరుదు దా దనద గాంచె "

       అని కొమార్తగా జెప్పబడినది. అయినను నూత్నగ్రంధ మగు వెలుగోటివారి వంశచరిత్రమునందు పైవిధముగావ్రాయుట లేఖశప్రమాదమనియు, అతని సుతకు బదులుగా "అతని పతికి" అని యుండినను నుండ వచ్చునని సెలవిచ్చి యున్నాడు. పైన జూపిన ప్రమాణములను బట్టియు ఈ క్రింద జూపబోవు శాసన ప్రమాణమును బట్టియు, పూర్వగ్రంధమునం జెప్పంబడిన ప్రకారము కొమార్త యని యే సిద్దాంత మగుచున్నది.

కూతు రనుటకు బలవత్తర మైన ప్రమాణము.

      ఇంతవఱకు ఏచరిత్రకారులును ఏశాసనపరిశోధకులును చూపింపని బలవత్తరమైన శాసన ప్రమాణమును గనబఱిచి రుద్రాంబిక గణపతిచక్రవర్తి కొమార్త యని నిశ్శంకముగా సిద్ధాంతము చేయుచున్నాను. గుంటూరు జిల్లాలో మంగళగిరితాలూకాలో చేరిన శ్రోత్రియాగ్రహార మైన మల్కాపుర మను గ్రామము నకు బడమట విశ్వేశ్వరస్వామివారి యాలయమునకు ముందర ఉన్న శిలాస్తంభము మీది శాసనము. ఈశాసనము కాకతి రుద్రాంబకాలమునను రెండవప్రతాపరుద్రునికాలమునను నున్న కాకతీయ గురుపరంపరలోని వాడగు శివమహాముని దానశాసనమైయున్నది.  ఇందు కాకతీయవంశ మభివర్ణింప బడినది. ఇందు శాసనమున్ వ్రాసినకవి గణపతి చక్రవర్తిని వర్ణించుచు కడపట:--