పుట:Andhrula Charitramu Part 2.pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రుగా వచ్చి ప్రసాదాదిత్యుని కౌగిలించుకొన్నదని చెప్పవలసి వచ్చునుగదా? అది యెంత యసహ్యకరముగా నుందగలదో వేఱుగ జెప్ప నక్కఱలేదు పూర్వకవుల యుద్దేశ్యము రుద్రవిభు డనగా రుద్రమదేవి గాక మొదటి ప్రతాపరుద్రుడని. అనగా బ్రసాదాదిత్యనాయకుడు మొదటిప్రతాపరుద్రుని కాలమున నున్నవాడని వారి యభిప్రాయము. అది కాలనిర్ణయమున కడ్డము వచునన్న భావముతో వెలుగోటి వంశచరిత్రకారు లా ప్రతాపరుద్రునికి బదులు గణపతిదేవు డన్మి మర్చిరి. ఇట్టి మార్పు చేసినందులకు బ్రమాణము నెమియుజూపినారు కారు. కనుక బ్రసాదాదిత్యనాయుడు మొదటి ప్రతాపరుద్రుని కాలము నుండెనో రుద్రమదేవి కాలమున నుండెనో యెవ్వరికిని దెలియదు. నాకు దెలిసి నంతవఱకు శాసనములలో నెచ్చటను వీరినామములు గాన్పింపలేదు. భావిపరిశోధనమున గాని వీరిఉదంతము దెలియంబడదు. అంతవఱకు నీతడు గణఫతిదేవుని తుది కాలమున నున్నవాడని యూహింతము. గణపతిదేవుడు పాండ్యరాజులతోడ జెసిన యుద్ధములలో నితడును నీతని సహోదరు డగు రుద్రమనాయుడును గూడ నుండి రని యూహించుటకు మాత్రము గొంచె మవకాశము గలదు. ఎట్ల యినను కాకతీయచక్రవర్తులర్ధాసనమిచ్చి రనియు తక్కిన 78 పద్మనాయకు లీతనికి మ్రొక్కి రనుటయు నేయాధారమును లేక యంతమాత్రము విశ్వ్గసింప రాదు. ఇది యిట్లుండగామఱియొక వింత యే మన:-

  "గీ. ధరణి ఘనమైన రాయపితామహాంక
       బిరుదు డేబ్బదియేడ్గురు వరుస నాయ
       కులుగ జేసియు భైరవువలన పచ్చ
       ధృడవరంబుగ గొనె బ్రసాదిత్యవిభుడు "

    అని వెలుగోటివారి వంశావళియందు, వరుసగ డెబ్బదియేడ్గురు నాయకులనుగ జేసి భైరవువలన రాయపితా మహాంక బిరుదమును బొందె నట! ఈపద్యమును బట్టి 77 నాయకులు ప్రసాదాదిత్యునివలన నేర్పడి రను భావము పై పద్యమున ద్యోతక మగుచున్నది.  పరస్పరవిరుద్ధములైన విషయము