పుట:Andhrula Charitramu Part 2.pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఈ పై జెప్పంబడిన రుద్రుడు మొదటి ప్రతాపరుద్రుడు డనుట సరిపడదు. కడపటి ప్రతాపరుద్రు డనుట;యు సరిపడదు. ఇందలి రుద్రుడెవ్వడు? కాకతి గణపతి చక్రవర్తి కూతురగు రుద్రమదేవి కావలయును. ఈమె రుద్రదేవు డని వ్య;వహింపంబడి యుండుటచేత రుద్రుడనగా రుద్రమదేవి యనియే యర్ధము చేసికొందము. అందెయు బెండెంబు గణపతిదేవునివలన బొందె నని పైని చెప్పిన దానికి విరుద్ధముగా రుద్రమదేవివలన బొందె నని చెప్పబడియున్నది. వెలుగోటి వారి వంశచరిత్రమునందు గణపతిదేవచక్రవరెతిచెత నర్ధాసనమును బొంది 76 పద్మనాయకులచేత బ్రణామణంబులు పొందెనని చెప్పబడి యుండగా రావువంశీ;యుల చరిత్రములో నుదాహరింపబడిన యొక సీసమాలికలో

    "భూరి జయుం డయి యోరుగంటికి రాగ
     రుద్రమూర్తిప్రతాపరుద్ర విభుడు
     ఎదురుగా వచ్చియు హెరుడవు నీవంచు
     ఘనత బ్రసాదిత్యు గౌగలించి
     హెచ్చైన కాల్పెండె మిచ్చి దోడ్కొని వచ్చి
     ముందఱ గూర్చుండ మొదట నిల్పి
     విడిరి కంపెడు వేళ వేడ్కతో లేచియు
     గౌగలించి జయంబు గాగ బనిచి
     మఱునాడు డేబ్బడేర్గురు నాయకులు గొల్సు
     తన సముఖాన కతందు రాగ
     దా లేచి యపుడు సంతస మంది యాతని
     బ్రియముతో గూర్చుండ బెట్టి కొనుచు
     డెబ్బడేర్గురిచేత మ్రొక్కులు వేయించి
     మించ బ్రతిజ్ఞ చెల్లించె విభుడు"

   అని చెప్పబడి యుండుటచేత రుద్రవిభు దనగా రుద్రమదేవి యని యర్ధము చేసికొనవలసిన పక్షయేన రుద్రమదేవి యంతటి చక్రవర్తిని యెదు