పుట:Andhrula Charitramu Part 2.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వెడలి వారలతో గఠినమైన యుద్ధము జేసి వారేల జయించి వచ్చి గణపతిరాయల వారివలన బ్రత్యుత్ధా నార్ధాసనాది సత్కారములను, ఇతరు లగు76 గోత్రమ్ల నాయకులచే బ్రణామము వెట్టించుకొనునట్టి మర్యాదను, గాలిపెంజీత మను బిరుదాభరణమును 'కాకతిరాజపూజితొ అనెడు బిరుదును శ్వేతచ్చత్త్రిద్వజములన్ బొందెను;" అనివ్రాయబడి యున్నది గాని శత్రువు లెవ్వరో అవ్వరితో వీరు పోరాడితో దెలిపి యుండ లేదు. ఇతని పరాక్రమమును మెచ్చుకొని యా గణపతిచక్రవర్తి గౌరవించి యుండును గాని యితనికంటె మహాశూరు లనెకు లాతని కొల్వుకూటములో నాతని సేవించి యుండగా నెల్లరకు నవమానకరముగా నర్ధాసన మిచ్చి వారలచే మ్రొక్కింప జేసె ననుట నిరాధారమై పరిహా సాస్పదముగ నున్నది. ఇతని ప్రతాపమును వర్ణించుచు నొకపద్య మీ క్రింది రీతిని వెలుగొటివారి వంశ చరిత్రమునందును, రావువంశీయుల చరిత్రమునందును బ్రకటింపబడినది.

   "సీ. ధరణిపై దెబ్బ డేర్గురు నాయకులలోన
            బటు ప్రతాపస్భూర్తి బరగినాడు
        చంద భుజా దండ మండి తారాతుల
            భండనంబుల జాల జెండినాడు
       ఏపున నోర్గల్లు నేలు రుద్రునిచేత
           నందెయు పెండెంబు నందివాడు
       విక్రమంబున ధరాచక్రంబులో గల
           బిరుదులు తనవిగా దిరిగినాడు
      వాడు రిపురాజ పన్నగ వైంతేయ
          రాజితంబైన కేరళరాజ ఘనుడు
      భాసురుం డగు రేచెర్లశాసనుండు
         సత్యసంధుండు సత్ప్రాపాదిత్యఘనుడు."