పుట:Andhrula Charitramu Part 2.pdf/328

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లెన్నియో గలవు. గ్రంధవిస్తరభీతిచేత వాని నన్నింటిని జర్చించుట విడిచి పెట్టుచున్నాడను.

రుద్రమనాయుడు

    ప్రసాదాదిత్య నాయని తమ్ముండగు రుద్రనాయుడును ప్రసిద్దుడైన వీరశిఖామణి యై యుండవలయును. ఇతినికిని రాయపితామహాంక మను బిరుదము గలదని యీ క్రింది పద్య్హములో జెప్పబడినది.

"మ.ఒగి నుక్కుంబొడిరాల నాయుడును ముద్నుద్గ్రీవులై యిప్పుడున్
      దగ నీయందియ యందునుండి తలక్రిందులై వైరిభూపాలకుల్
      గజతీభారమునన్ పసిండి పొడి నిచ్చల్ రాయమన్నా రదే
      తగదే రాయపితామహాంక జయ భద్రా రుద్ర నిన్ జెందినన్
      మఱియును "పాండ్యగజకేసరి కాకతిరాజ్య ప్రతిష్ఠాపకాచార్య"
బిరుదులు గలవని యీక్రింది పద్యములో జెప్పబడినది.
   "ఉ. వాలని విక్రమస్ఫురన వారలు పాండ్యబలంబు దంతులన్
         గేళి జయించి పాండ్యగజకేసరినామము దాల్చి రెంతయున్
         జాలినవారుగా నెగడి సన్నుతి కాకతిరాయరాజ్య ల
         క్ష్మీలలనా ప్రతిష్ఠతగ జేసిరి భూజను లెల్ల మెచ్చంగన్"

        కాకతి రాజ్యప్రతిష్టాపనాచార్యు లయినవా రొక్క రుద్రమనాయుడు మాత్రమె గాక యనెకులు గలదు. ఈరేచర్ల రుద్రమనాయుడు రుద్రదేవి కాలమున నధిక ప్రఖ్యాతికి వచ్చినట్లు గానంబడుచున్నది. గావున నీతని విషయ మిక్కడ సంక్షేపించి రుద్రమదేవినిం గూర్చి వ్రాయు ప్రకరణమున మరల వక్కాణింతును, పద్మనాయకవీరు లనేకులు గణపతిదేవ చక్రవర్తికి విశ్వాసపాత్రు లయిన భృత్యులుగ నుండి యుద్ధములం దాఱితేఱిన రణశూరులై కాకతిరాజ్యప్రతిష్ఠాపకు లన్న ఖ్యాతిని సంపాదించి రనుటకు సందియము లేదు గాని తక్కిన శాఖలలోని మహావీరు లైన సైన్యాధిపతుల కంటె వీరే యగ్రగణ్యులని కాకతీయ చక్రవర్తు లందఱును విడిచిపెట్ట్ వీరలకే యర్ధాసనము లిచ్చి సమ్మానించి రనుట మాత్రము విశ్వసింప దగినది కాదు.