పుట:Andhrula Charitramu Part 2.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పేర్మి లోబఱుచుకొని కొన్ని సంవత్సరములు కారాగాగృహమున నుంచెను. అపుడ్ వారు జాత్యుచితసంస్కారవెహీనులై పెద్దకాలంబు కారాగృహంబున నుండ నోపక పద్మపతి కణ్భివాదనాదుల నాచరింప నంగీకరించి తదనుగ్రహంబున వెడలి వింధ్యగిరిదక్షిణప్రాంతమున వంగకళింగాంధ్రాదిదేశములు చేరి యచ్చటఛ్చట రాజ్యముల నాక్రమించుకొనిరి. ఇట్లు కాగా వారు పద్మపతివలన బహుకాలము జాత్యుచితసంస్కారహీనులై యొక తెగవారు గా నేర్పడి శూద్రప్రాయులై యున్నందున నేకులమువారనియు జెప్పుటకు వీలు లేక పద్మనాయక కులము వారని వ్యవహరింప బడుచువచ్చిరి. అనంగా బద్మపతి యనువాడు నాయకుడు గా గల కులమువారని యభిప్రాయము. ఇట్లు బొబ్బిలివారి రావువంశీయ చరితము 49 పేజీలో వ్రాయబదినది." అని వ్రాయించినారు. పద్మనాయడను నాత డెవ్వడో వీరికి బోధపడలే దని పైవాక్యములనుబట్టి దెలియుచున్నది. అయిన నేతర్గ్రగ్రంధకర్తలు "బేతాళనాయుడు రేచర్లవంశజులకు మూలపురుషుడు గా నుండినట్లు వెలమకులమువారి కందఱకు బ్రప్రధమము పద్మనాయకు డను నతడు మూలపురుషుడై మహాప్రసిద్ధుడుగా నుండి తన్మూలమున గులము వాఱందరు పద్మనాయకకులమువా రని వ్యవహరింపబడుచున్నా రని చెప్పిన జెప్పవచ్చును గదా" యని వ్రాయుట వింతగ నున్నది. వెలమకులము వారి కందఱకు బద్మనాయకుడు మూలపురుషు డని చెప్పుటకు గల యాధార మెయ్యదియు గానం బడదు. పర్మనాయక కులముయొక్క యుదంతమెఱుంగక యె నాల్గవవర్ణములో నత్యుత్తమ మైన దని వ్రాయుటయు వింతగ నున్నది. చరుర్ధవర్ణములో జేరిన తక్కిన శాఖలవారికంటె నెట్లుత్తమ మయినదో ప్రమాణములు చూపించకపోవుట వలన నం దెట్టియో విశేషముండె నని బోధ పడక పోదు. రాఫువంశీయచరిత్రమునందు "ఏకులమువారనియుం జెప్పుటకు వీలు లేక పద్మనాయక కులమువా రని వ్యవహరింపబడుచు వచ్చి" రని తేటతెల్లము సేయుచుండ వేఱుగ వ్యాఖ్యాన మేల! పద్మనాయకు లొకప్పుడు క్షత్రియులుగ నుండి శూద్రప్రాయు లయి పోయి రని