పుట:Andhrula Charitramu Part 2.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలుపుచు అందువలన బ్రమాణికముగా ననేకక్షత్త్రియులు శూద్రులయిపోయిరని పురాణాదులలోనుండి కొన్ని వాక్యములను బ్రకటించి యుండిరి. అయ్యది వీరిని గుఱించి వ్రాయబడినవవికావు.

    "వసిష్ట కౌండిన్య ధనంజయానాం
     గోత్రోద్భవా కాశ్యపగోత్రజాతా:
     శూద్రా ఇ వాత్యంతగృహీతవేషా:
     భూపా భష్యంతి కలౌ యుగే హీ."

  అని వసిష్ట కౌండిన ధనంజయ కాశ్యపగోత్రజాతు లయిన రాచవారిని గూర్చి చెప్పంబదినవాక్యములు గాని పద్మనాయకులను గూర్చి చెప్పినవి కావు. రావు వంశీలయ చరిత్రకారునకు గూడ సందియము తొచి స్పష్టముగ జెప్ప జాలక "అట్టివారు శూద్రవేషధారు లగు క్షత్రిఉయులు ఆంధ్రాదిదేశములలోనే స్థిరపడి నట్లుండుటం బట్టి వారీ పద్మనాయకులకు నామమున నుండిన శాఖమువారుగా ననుమానింపబడుదురు." అని వ్రాసి యున్నారు.  ఇటీవలి శూద్రులు క్షత్రియు లై రనుటకు గారణము వర్ణాశ్రమధర్మములో జేరిన  కులముచేత గాక క్షాత్త్రమును దాల్చి భూమిని జయించి పాలించుట యని చెప్పవచ్చును.  అట్టివారు పదునెనిమిది జాతులలోను గూడ నుండి రనుటకు లేశమత్రమును సంశయము లేదు.  కాబట్టి అద్మనాయకుల నిజస్థితి దెలిసి కొనుటకు బ్రయత్నింతము.  ఈ వెలుగోటివంశములోని వారి ప్రేరణము చేతనే వ్రాయింపబడిన పద్మనాయక చరిత్రమునందు నేమి వ్రాయంబదినదో విచారింతము. అందు వెలమల జన్మ వృత్తాంతమును గూర్ఫి యీక్రిందికృతిని వ్రాయబడి యున్నది.

     "క. శూరుల జన్మస్థానము
          నారసి నియమింప గూడ దది యెట్లున్నన్
         వీరుల షణ్ముఖమారులు
         నూరిజనుల బోల మిగుల జోద్యం బగుచున్"