పుట:Andhrula Charitramu Part 2.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శాసనముల వెలమశబ్ద మెచ్చట నైన గలదా యని విచారించగా మొదటి కులోత్తుంగ చోడచక్రవర్తి కుమారు డైన రాజరాజ చోడగంగుచే వ్రాయించబడిన టేకీ శాసనములో "వెలమనూళ్లు" అను నొక తెగవారు తెలికెతెగ వారిలో గల రని గనుపట్టుచున్నది. తాము సహస్రశాఖావ్యయ గోత్రుల మనియు, మనుకులక్షత్రి యుల మనియు దమశాసనములం దెలికెతెగవారు చెప్పుకొనియున్నారు. ఏది యెట్టులున్నను వెలమవారెల్లరు నొక్కతెగలోనివారు కారు; అట్లే రెడ్లుగూడ నొక్క తెగలోనివారు కారు.

పద్మ నాయకులు.

   వెలమలలో నొకశాఖవారని చెప్పంబడి పద్మవెలమలే పర్మనాయకులని చెప్పుకొనుచున్నారు. సత్త్యకదృష్ఠి తోడను నిష్పక్షపాతబుద్ధితోడను విమర్శించి చూచిన పక్షమున బద్మనాయకులు కేవలము వెలమలలోనుండి యేర్పడిన వారుగా గనుపట్టరు. పద్మనాయకులన నెవ్వరో మనము తెలిసికొనుటకు బూర్వము పద్మనాయకుల మని చెప్పుకొనువారిచే బ్రకటింపబడినవారి గ్రంధములో నేమి వ్రాయబడినదో విచారింపవలసియుండును.  పద్మనాయక కులజు లయిన వెలుగోటి వారి వంశచరిత్రమునందు "వీరు నాల్గవవర్ణములో నత్యుత్తమమైన పద్మనాయక కులమువారు.  ఇందు బద్మనాయకు డనగా పద్మబాంధవుండగ్ సూర్యుడు" అని వ్రాయబడియుండియు నేమికారణము చేతనో "లేదా, పద్మనాయకుం డనగా పర్మపతి యను రాజు అతడు.

     'శ్లో. మహాపద్మపతి: వశ్చిన్ననద: క్షత్త్రివినాశకృత్ ' అని పురాణములయందు జెప్పబడినవాడు; అతనివిషయటుఇ సంక్షేపముగ ని
ట్లెఱుంగ దగినయది:-

   'మహానంది యను రాజునకు వివాహితశూద్రస్త్రీయందు మహాపద్మపతి యను వాడుదయించెను.  అతడు సూర్యచంద్రవంశజు లగు రాజులను దనకు వందవాడు. లాచరింపు డని నిర్భంధించి వశపడనివారిని విక్రమము