పుట:Andhrula Charitramu Part 2.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కొని యుత్తరభూమిని జయింపగోరి పలుమాఱు దాడి వెడలి వచ్చి నెల్లూరు నకు గిగువ నున్న దేశమును గల్లోల ఎట్టుచుండిరి. వారిలో జటమ్మ సుదర పాండ్యంహారాజు ప్రముఖుడై క్రీ.శ.1249 దవ సంవత్సరమున గాంచీపుర మాక్ర ఇంచుకొని యుండ గాకతి గణపతిదేవు డసంఖ్యాకము లయిన సైన్యములతొ వేతెంచి సుందరపాండ్యమహారాజును కాంచీపురమునుండి పాఱద్రోలి యాపురము స్వాధీనపఱుచుకొనియెను.

                       సామంత భోజమంత్రి.
     ఇచ్చట క్రీ.శ. 1849 దవ సంవత్సరమున గణపతిదేవచక్రవర్త్రి యాజ్ఞను శిరమున వహించి యాతనిససచివాగ్రణీయు, సైన్యపాలుడును, చక్రవధారిఉయు నై కాంచీపురము పాలకుడుగా నియమింపబడిన సామంతభోజుడు కాంచీపురము లోని యేకామ్రేశ్వరునకు కాలత్తూ రనియెడు గ్రామమును దానము చేసి శాసనము వ్రాయించెను.  ఈసామంతభోజునియొక్క శాసనము మఱియొకటి కాళహస్తిలో మణికంఠేశ్వరుని గుడికి నెదుట నున్న ఱాతిపైని గనుపట్టుచున్నది. భోజమంత్రి కాశ్యపసగొత్ర జాతుండయిన దాచమంత్రికిని నారీరత్నమున్ సోమనాధునికి (శివునకు) భక్తురాలు నగునాచారంబకును కుమారుడని చెప్పం బడియుండుటచేత నితడు నియోగి బ్రాహ్మణుడుగా నూహింప దగియుండెను. ఇతడు కాళహస్తీశ్వరనగరమున బ్రతిదినకైంకర్యాదులను జరుపునట్లు చేసె నని గ్రంధలిపిలో వ్రాయంబడిన యాశాసనము దెలుపు చున్నది.1\
                     పాండ్యులు మరల నెల్లూరు నాక్రమించుట.
       కాకతి గణపతిదేవచక్రవర్తి దక్షిణ దిగ్విజయ యాత్రను ముగించి

1.The Indian Antiquary, Ekamaranatha inscription of Ganapati, Vol. XXI p.. 197; No.15 Ganapeswaram Inscription of the Time of Ganapati.