పుట:Andhrula Charitramu Part 2.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గణపతి దక్షిణదేశముపై దండెత్తుడు.

      గణపతిచక్రవర్తి వెలనాటిరాజుల్ను జయించి తరువాత వెలనాటికి దక్షిణ భాగమైయున్న కమ్మనాటిని బరిపాలించుచున్న చోడరాజులను గూడ జయించెను. కొట్యదొర (కొణిదన) పురాధీశ్వరుందును, నన్నెచోడభూపాలుని, కుమారుండు నైన త్రిభువనమల్లచోడభూపాలుని, వాని యాప్తవర్గములోని మఱి కొందఱు చోడరాజులను జయించి సామంతులనుగ జేసికొనియెను. అటుపిమ్మట కందుకూరుసీమలోనియద్దంకి పైదండయాత్ర వెడలి యాపట్టణమేలుచున్న సేవణ దేశస్తుడైన మాధవరాజును జయించి యటనుండి ములికినాటి దేశముపై దండెత్తి పోయి ములికినాడు పొత్తపినాడు, రేనాడు, గండికోట సీమ మొదలగు ప్రదేశముల నెల్ల జయించి యటనుండి కాంచీఉరమును ముట్టడించెను.  ఈ దండయాత్రకు గారణము పాండ్యులు మొదలగు దాక్షిణాత్యులు కాంచీపురమునుండి తెలుగు చోడులను దఱిమి యాపట్టణ మాక్రమించుకొని యుండుటచేత దెలుగుచోడులను  గణపతి చక్రవర్తి సాహాయ్యము నపేక్షించి యుందురు. అట్లుగాక కేవలము ద్రవిడ దేశ విల్జిగీషాఅమనీషం దండెత్తిపోయి యుండవచ్చును. ఎట్లయిన నేమి? గణపతి దేవచక్రవర్తి దక్షిణ దేశముపైదండెత్తిపోయి కాంచీపురము వఱకుగల దేశము నంతయు జయించి యతనినే తంకు సైన్యాధ్యక్షునిగ జేసికొని నటులు గాన్పించుదున్నది.
                  గణపతి పాండ్యులను జయించుట.
     మనుమసిద్ధితండ్రి యగు తిక్కరాజు కాలమున బాండ్యులు కాంచీపురముపై దండెత్తివచ్చి యారాజ్యమాక్రమింపగా దిక్కరాజు పాండ్యులతో యుద్ధము చేసి వారలను దఱిమి మరల చోదునిసింహాసనమున గూరుచుండ బెట్టి చోళస్థానా చార్యబిరుదమును వహించెనని తిక్కరాజునిగూర్చి వ్రాసిన ప్రకరణమున దెలిపి యున్నాడను. తిక్కరాజు మరణానంతరము పాండ్యరాజులు తమతొంటిపూనికను విడజాడక కాంచీపురము మొదలు