పుట:Andhrula Charitramu Part 2.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

స్చస్థలమైన యోరుగంటికి చేరిన తరువాత జటవర్మ సుందరపాండ్యమహారాజు మఱుసటి వత్సరమున మరల దాడి వెడలి కాంచీపురమును, విక్రమసింహ పురమును (నెల్లూరు) స్వాధీనపఱచుకొనియె;ను. ఇందులకు గారణము విక్రమ సింహపురాధెపత్యమునకై తెలుగ్తు చోడరాజులు తమలో దాము పోరాడి యొక పక్షమువారు పాండ్యులు సాహాయ్యమును గోరి యుండును. క్రీ.శ.1250 దవ సంవత్సరమున జటవర్మ సుందరపాండ్య మహారాజు మనుమసిద్ధిరాజును నెల్లూరినుంది పాఱద్రోలి సిద్దిరాజునకి శత్రువుల యిన వీరులను పట్టాభిషిక్తులను గావించి విక్రమసింహపురములోని పళ్లికొండపెరుమాళ్ల దేవునకు సుందరపాండ్య సంది యను భవమును గట్టించుటయే గాక యాదేవుని నిత్యకైంకర్యాదులకు మండనాటిలోని మారడికుండ గ్రామమునుండి వచ్చెడి సమస్తము లయిన పన్నులను వినియోగించుటకై యాగ్రామమును కళింగరాజు (తెలుగురాజు) యొక్క ప్రేరణముచేత దారనము చేసి శాసనము వ్రాయించెను.1 అయినను గణపతిదేవచక్రవర్తియొక్క సైన్యాధిపతులతో డ్పాటుతో విజయగండ గోపాలదేవుడు మొదలగు తెలుగు చోడరాజులు పాండ్యుని వానిసైన్యములను నెల్లూరిమందలమునుంది పాఱద్రోలిరి.

              గంగయ సాహిణి బాహత్తరి నియొగాధిపతి.
    కాకతి గణపతిదేవచక్రవర్తి గండికోట, ములికినాడు, రేనాడు, పెనదాడి,పెడకల్లు, సకిలినాడు, ఏరువనాడు, పొత్తపినాడు మొదలగు సీమల నెల్ల జయించి గంగదేవ మహారాజును తనకు సైన్యాధ్యక్షునిగ నియమించి యాతడు తనకు బ్రతినిధిగ నుండి పైసీమలను బరిపాలించునట్ లనుజ్ఞ నొసంగెను. కాబట్టి యప్పటినుండియు గంగయ సర్వాధికారియై సైన్యాధ్యక్షుడై ప్రతినిధిపరిపాలకుడై మిగుల వాసి గాంచెను.  గణపతిదేవచక్రవర్తికి లోబడిన సామంతరాజుల నెల్లరను శాసించి యదుపులోనుంచి ప్రఖ్యాతు

1. Nellore Inscriptions, Part II. page 830. No.16