పుట:Andhrula Charitramu Part 2.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గుడిమెట్టశాసనములో దోరపరాజునకు చిమ్మాంబిక యందు జనించిన పోతరాజు పరిపాలనమును వర్ణించుచో,

      "శ్రీకృష్ణవేణ్యాస్తటభూమభాగే
        శ్రీపోతభూపో గుడిమెట్టనామ్ని
        విశ్వేశ్వరాఖ్యం శివ మాదిదేవం
        సంస్థాపయామాస పురే స్వకీయే."

అని గుమెట్టలో విశ్వేశ్వ్వరస్వామిని బ్రతిష్ఠాపనముజేసె నని చెప్పంబడి యుండు టచేత రామవిలాసములోని నరసింహుని పోతరారును, ఈదోరపరాజు పోతరాజును నొక్కడే య;ని చెప్పదగును.

    అట్లయినయెడల దోరపరాజునకు నరసింహరా జును నామాంతరము గల దని యూహింపవలయును. ఇంతియగాక బెజవాడ కనకదుర్గాంబయొక్క యాలయములో శ్రీనరసింహవర్4దెహనచాగిపోతరాజు పేరిటి శాసన మొమటి గలదు. అయ్యది నరసింహుని కుమారు డైన చాగిపోతరాజుశాసన మని తెలుపు చున్నది.  కాబట్టి ప్రస్తుతము దోరపరాజు త్రిపురాంతక కాశ్మీరమల్లేశ్వర విశ్వనాధ చోడనారాయణ స్థానంబుల గనకకలశంబులను బెట్టించి సింహగిరియందు నరసింహునకు సాగిపోతసముద్రం బను చెఱువుగట్టించి శ్రీపర్ఫ్వతంబున (శ్రీశైలమున) మల్లికార్జునదేవునిముందట సందికేశ్వరుని బ్రతిష్టించి దేవ భోగంబు లకై కంభముపాడు, ముచ్చింతలు బూదవాడ మొదలగు గ్రామముల నిచ్చి, బ్రాహ్మణోపభోగంబులు గా ననేకాగ్రహారంబు లొసంగె నని బెజవాడశాసనమున జెప్పబడి యున్నది.  ఈశాసనము కాకతిగణపతిదేవ చక్రవర్తి సిమ్ఃఆసన మధిష్టించిన క్రీ.శ.1199 దవ సంవత్సరమున వ్రాయబడినది. ఈ కుటుంబములోని వాడగు చాగిమనుగణపతిదేవునిశాసనములు గూడ పెక్కులు నందిగామసీమలో గాన వచ్చుచున్నవి. అతడును, చాగిరాజును కాకతిగణపతిదేవునకు సమకాలికులు. వీరు నతవాటిసీమలో నధికారములను వహించియుండిరి. వీరున్ నతనాటిసీమను బరిపాలనముచేసిన భుద్ద