పుట:Andhrula Charitramu Part 2.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

        రాజధానిగ సత్కళాభోజరాజు
        సాగిపోతక్షమాభర్త జగతి యేలె."

ఈ సాగివంశపురాజూలయొక్క శాసనములు కృష్ణామండలములో నందిగామ సీమలో నున్న గుడిమెట్ట, ముక్త్యాల, అనుమంచిపల్లె, పెనుగంచిప్రోలు, నవాబు పేట, మొదలగు ప్రదేశములందును బెజవాడలోను గానంబడుచున్నవి. నందిగామ తాలూకాలోని ముక్త్యాలగ్రామములో నున్న చెన్నకేశవస్వామి దేవాలయముయొక్క తూర్పుప్రాకారమ్నకు సామీప్యమున బాతియున్న నాగులబండ అంస్తంభముమీద వ్రాయబడిన శాసనములో విష్ణువునాభి నుండి బ్రహ్మ జనించెననియు, అతనివంశమున గోంకదోరపరాజును, అతనికి పోతరాజును, ఆపోతరాజునకు రాజాంబిమయందు త్యాగరాజు (చగిరాజును), అతనికి దోరపరాజునుజ్, అతనికి చాగిపొతరాజును జనించి నని చెప్పబడినది. గుడిమట్టలోని యొకశాసనములో చాగిదోరపరాజునకు చిమ్మాంబిక యందు పోతరాజు జనించెననియు, అతనికి రాజాంబిక యను పతివ్రతయైనభార్య కలదనియు వ్రాయంబడి యున్నది. ఏనుగులక్షణకవిప్రణీతమైన రామవిలాసము లో సూర్యాన్వయమున సాగిరాపోతరాజు జనించెననియు, అతనికి నరసింహరాజును, అతనికి తెలుగురాజు, రామరజు ననువారును బుట్టిరనియు, జెప్పంబడి యున్నది. పైనిజెప్పినవారిలో నరసింహభూపతి కుమారుడైన పొతరాజును లక్ష్మణకవి తనగ్రంధమునం దీవిధముగా నభివర్ణించి యున్నాడు.

        "మ. స్థిరభక్తిన్ గుడిమట్టలోపల బ్రతిష్ఠించె న్గృపాసింధుబం
              ధురసౌధంబున విశ్వనాధు బరమాత్మున్ రాజనారాయణున్
              సురివంద్యున్ బెజవాడయందు నిలిపెన్ సుశ్లోకధర్మైకత
             శ్వరశీలుం డగుమన్మపోతనృపు డేతన్మాత్రుడే యెన్నగన్."