పుట:Andhrula Charitramu Part 2.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రాజు, రుద్రరాజు, మాధవరాజు మొదలగువారును నొక్క కుదురులోని వారు గా గ్తనుపట్టెదరు.

      ఈసాగివంశపురాజులచరిత్రమును సంపూర్ణముగాదెలిసికొనుటకు మఱి కొంతకాలం పట్టును. ప్రస్తుతముజ్ దొరికిన సాధనము లసంగ్రహములుగ నున్నవి.
                   వేములవాడ భీమకవి
   సాగిపోతరాజుగారు గుడిమెట్టలో బరిపాలనము చేయుచుందగా వేములవాడ భీమకవి విషమాక్షరప్రయోగముచేసి తిట్టి పద్యము చెప్పగా నతౠ మృతినొందె నని భీమకవి గుడిమట్టకు బోయినప్పుడు పోతరా జాతనిగుఱ్ఱమును గట్టి పెట్టించ్వి విడువనందున, ఈక్రింది పద్యముచే శపించెనని చెప్పుదురు.

     "చ.హయమ మది సీత, పోతవసుధాధిపు డారియు రావణుండు, ని
          శ్చయముగ నేను రాఘవుడ, సహ్యజ వారిధి, మారు డంజనా
          ప్రియతనయుండు, లచ్చన విభీషణుని, డాగుడిమెట్ట లంక, నా
          జయమున్ బోతరక్కసునిచావును నేడవనాడు చూడుడీ."

ఇది యధార్ధమైననుఇ గాకపోయినను భీమకవి యాకాలమున నున్నవాడని చెప్పవచ్చును. ఈమహాకవినిగూర్చి విశ్వసింప నర్హములుగాని కధ లనేకములు కల్పింపబడి దేశమునందంట జెప్పుకొనబడుచున్నవి. ఇతడు నృసింహ పురాణమును రచించెనని శ్రీమాఅనవల్లిరామకృష్ణయ్యగారు వ్రాయుచు నీక్రింది పద్యము నృసింహపురాణములోని దని కుమార సంబవ కావ్య పీఠికలో నుదా హరించి యున్నారు.

     "ఉ. వాండిమి నల్లసిద్ధిజనవల్లభు డోర్చినరాజు భీరుడై
           యాండ్రను గాన కుండ వృషభాంశము పెట్టికొనంగ జూచితో
           నెండిదె యేమి నీ వనుచు నెచ్చెలు లెల్ల హసింప నంతలో
           మూండవకంటితోడిదొర మూర్తి వహించిన మ్రొక్కి రంగనల్."