పుట:Andhrula Charitramu Part 2.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గాంతు నని ప్రతిజ్ఞ చేసెను. బ్రహ్మనాయుడు తనకుమారుని పౌరుషవిక్రమాదులకు మెచ్చుకొని యుద్ధమును జేయుటృఅకు సమ్మతించి తనకడకు వచ్చిన రాయబారులను మరల బంపి వైచెను. అటుపిమ్మట యుద్ధము ప్రారంభమయ్యెను.

            బాలచంద్రనరసింహుల యుద్ధము
       మొట్టమొదట బాలనాయుడు తనతండ్రివలన రణనీతి నుపదేశమునొంది బ్రహ్మనాయనికి సమస్రృతులు గావించి రణభేరు లధిమమై మ్రోగుచుండగా జంద్రాయుధము నొఱనుండితీసి జళిపించి యుగ్రుడై నిజసైన్యసమేతుడై శత్రుసైన్య్హము నెదుర్కొన బయలుదేఱెను. ఇట్లు బయలుదేఱిన బాలచంద్రుని సైన్యమును నరసింహభూపతిసైన్యములు మార్కొనియెను. అప్పుడు బాలనాయని ఢాకకు నిలువజాలక నరసింహుని సైన్యంబులు పలాయనంబు లగుచుండ నరసింగరాజు నిలువంబడి పాఱిపొవుబంటులకు పౌరుష మెక్కించి బరల్చుకొని శత్రుసైన్యంబుల పయింబడిన నుభయపక్షములవారికిని సంకుల సమరమయ్యెను. అప్పుడెదురుగ నొక్కశూరవరుడు వెల్లనైన భద్రగజము నెక్కిరాగ నతండె నరసింహుడని భ్రమించి బాలనాయుడు సింగంపు గొదముమాడ్కి వానిపై దుమికి మదగజముయెక్కఘన మైనమస్తకంబును ఖండించి ధరపైని గూల్చి మొలనున్నకటారితో వీరవరుని వక్షస్థలంబును బొడిచి వ్రక్కలుచేసి తమకంబుచే వాని తల దెగువ్రేసి తనచేత బట్టుకొని తండ్రికడకు విచ్చేసి యిదే నరసింహును శిరం బని యతని ముంగట బడవైచెను. అంతట నయ్యదొ నరసింహుని శిరము కాదని బ్రహ్మనాయుడు  చెప్పగా సిగ్గుపడి మరల సమరభూమికి జనుదెంచి యెప్పటియట్ల దలంపడి నరసింహభూపతితోడ ఘోరమైన యుద్ధము జేసెను. ఆయుద్ధమునందు నిక్కముగా బాలనాయుడు నరసింగుని సామంతరాగోలచే వక్షంబునంఫొడుఫగా నతండు మత్తగగజంబుపై గూలెను.