పుట:Andhrula Charitramu Part 2.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నరసింహుని తలగోయుట.

       అంతట బాలనాయుడు పశ్చాత్తప్తుడై మిక్కిల్.ఇ దు:ఖించి నరసింహుని చెయ్డములం దలపోసి తనవలన దోష మేమియు లేదని వక్కాణించుచు గత్తితో దలగోసి యధ్దానిం గైకొని బ్రహ్మనాయని సభకుబోయెను. బాలనాయుడు చేసిన వీరకృత్యమున కద్భుతంబంది నరసింహుని మరణమున కెల్లవారును మిక్కిలి దు:ఖించిరి. తుదకు బ్రహ్మనాయుడు సహితము బాలనాయని నిందించెను.
                    బ్రహ్మనాయని దోషము లెన్నుట.
       అందులకు సహింపజాలక బాలనాయుడు తండ్రి చేసిన దుష్కార్యముల నెన్ని యీక్రింది రీతిని దూషించెను.

            "వెడవెడయేడ్పులు వేగచాలింఫు
              కొల్వులో మామామ కొమ్మభూపతికి
              నలగామరాజుపగకయి యప్పగించితిని
              నీస్వభావం బింక నే వివరింతు
              బోగొట్టితివి కోడిపోరున భూమి
              నిను నమ్మివచ్చిన నీమేనమఱది
              ప్రాణంబు గొన్నట్టి పాపాత్మకుడవు
              చెలువునూడగ బంప జెవులరాయనను
              జటులకర్ముండవై చంపించితీవు
              ఘను వేంకజోడును గలనికి బంపి
              మందలో జంపితి మాయ యొనర్చి
             యిటువంటి నీచేష్ట లెన్ని వర్ణింతు"
              

ఇట్లు తండ్రిచేసిన దుష్కృత్యములను దూషించిన దండ్రియు 'వినుమతులకు వెన్నిచ్చి వచ్చిన నీవంటివీరుడను గాను ' అని యుల్లంబు నొనాడ బలికెను. అసలుకు చెవులకు శూలమైనాట నచట నిల్వంజాలక బాలనాయు