పుట:Andhrula Charitramu Part 2.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

     దంట లై యుండిరి దక్షత మెఱయ
     నందెలరాముండు నానెమలిపురి
     ముమ్మడిరెడ్డియు మొనతీర్చినట్టి
     పొందుగ్లను నేలు భూరివిక్రముడు
     వీరమల్లును నట్టి విఖ్యాతు డొకడు
     నుత్తరభాగ్తాన నుండిన వేడ్క
     నిందఱనెల్లను హెచ్చరించుచును
     దిరుగుచు నరసింగధీవరు డుండె
     విక్రమసింహంబు వీరకామేంద్రుం
     డబ్భంగిసేనతో నచ్చటవిడిస్దె"

అంతట బాలనాయుడు నలగొండ వదలి సోదరులతో బయలుదేఱి పోయి కార్యమపూడి కరిగి సభలో ప్రవేశించి రాజదర్శనమునకు మార్గ మిమ్మని సభాస్తారుల ద్రోచుకొని రాజుసన్ముఖమునకు బోయి మ్రొక్కెను. ఇతని రాక యెవ్వరికిని సంతోషము గలిగింపలేదు. రాజు భయముచేత బెడమొగము పెట్టెను. అప్పుడు కొల్వులో గూర్చుండిన బ్రహ్మనాయని ప్రియశిష్యుండగు మాలకన్నమనాయుడు బాలుని తుండుడుకుదనమును నిందించి తృణీకరించి పలికెను. బాలనాయుడు సంధికార్యమున కొప్పుకొన్నందులకు మలిదేవభూపతిని సమ్ముఖంబున దూషింప నారంభించెను. బాలనాయుడు తన మామయైన్మ గండుకన్నమనాయనితోడ గొంతవడి చర్చించి యోధులకు రోషము వచ్చుమాటలాడి యుద్ధమునకు బురికొల్పసాగెను. బాలనాయుడు తనభార్య చెప్పినమాట విశ్వసించి తనతో యుద్ధభూమికి రానీయక శత్రువులతో బోరాడి కీర్తిగడింపనీయక మిషపెట్టి వీర్5అమేడనికి బంపి మోసముచేయు నని దు:ఖించి అనపోతరాజు ప్రాణత్యాగము చేసిన సమాచరమును మాడచి యను యువతివచ్చి దెలుపగా బాలనాయుడు మిక్కిలి చింతించి మహోగ్రుడై లేచి తానొక్కడుపోయి శత్రువులమార్కొని పోరాడి విజయంబు