పుట:Andhrula Charitramu Part 2.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ముడిగెడు నని వానిని దిట్టి శపించెనట! ఆపలుకులు చెవినిబడ్డతోడనే యొక్క నిమిషమైన నచ్చట నిలువనొల్లక యామెను మన్నింపవేడి వెంటనే తల్లి యొద్దకు బఱుగిడిపోయి యుద్ధసమాచారములు దెలుపవలసినదని యడిగెను. ఆమెవలన సకలసంగతులను దెలిసికొని తానుగూడ సమరస్థలికి బోయు తండ్రులకు దోడ్పడి స్వధర్మమౌను నెఱవేర్చుకొనుటకు కనుజ్ఞయిమ్మని తల్లిని బ్రార్ధించెను. ఆమె తనయుని సాహసంబున కచ్చెరువందుచు బాలురకు యుద్ధము వలదనియు, యుద్ధముల వలనగలిగెడి యనర్ధముల నెన్నింటినో బోదించియు, నామార్గమునుండి వాని చిత్తమును మరలింప్ నెంతియో ప్రయత్నించెనుగాని వాని మనంబు మార కుండెను. అప్పుడాతడు వీరధర్మ ప్రభావముంబు తల్లికి నీవిధముగా బోధించెను.

          "కార్య;మపురమందు ఘనపరాక్రమత
           దండ్రులునిలుచుండి దండుసేయంగ
           నేనిటనుండుట నీతియే తల్లి?
           యుండునంటకునీకు నొప్పునా మనసు
           నీవెఱుంగనిధర్మ మేనెఱుంగుదునె
           ప్రాకృతభామలపగిదిం బల్కెదవు
           వెఱ్ఱితనంంబేల వీరునిసతికి
           గాయ మనిత్యంబు కల్మి హుళక్కి
           జలబుద్భుదవిధంబు క్షణభంగురములు
           షట్చక్రవర్తులు సకలభూపతులు
           ననిరి బ్రహ్మేంద్రాదిసర్వదేవతలు
           భూతంబు లైదును బొలియుచు నుండు
           శౌర్యసత్కీర్తులు సమయ వెన్నటికి
           సకలపురాణముల్ సద్ధర్కకధలు
           నీతిశాస్త్రంబులు నీవెఱుంగుదువు
           పౌరుషాధికతచే బ్రదుకట లెస్స