పుట:Andhrula Charitramu Part 2.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంతట భట్టుమూర్తి యాగ్రహమునుబొంది నలగాముని దూలనాడి బ్రహ్మనాయని ప్రతాపాదుల నభివర్ణింఇ భయపెట్టజూచెనుగాని నాయకురాలు వానిమాటలను దృణీకరించి 'నీవెంత, నీబలమెంత, బట్టువాడవుగాన బ్రదికిపోతివి, పోపొమ్ము" అని గంభీరవాక్యములు పలికి దూతను వచ్చినదారిని బంపివైచెను. అటుపిమ్మట నలగామరాజును నాయకురాలును మంతనముచేసి యుభయపక్షములలోని బలముల తారతమ్యమును విచారించి తకము సాహాయ్యము చేయవలసినదిగా నానాదేశరాజులకును లేఖలను బంపించిరి. నాయకురాలు నిజబలంబులను యుద్ధమునకై సన్నద్ధపఱిచి నలగామునకు బ్రోత్సాహముంగలిగించుచుండెను. నలగాముడును వీరపురుషోచితం లైనకర్మముల నెల్ల నాచరించి గజారోహణం బొనర్చి నిజసైన్యంబుతోడ బయలుదేఱి కార్యముపూడికి వచ్చెను. మహారాజు లనేకులసంఖ్యాకములయిన సైన్యంబులతోడ వచ్చి యుద్ధభూమిని నలగామరాజుని గలిసికొన్నట్లుగా వీరచరిత్రేమున మిక్కిలి యతిశయోక్తులతొ గూడిన వర్ణనములతో జెప్పబడియెను. ప్రతాపరుద్రుడు వేయియశ్వంబులనంపె ననిమాత్రము చెప్ప బడినది గాని యాతండు యుద్ధభూమికి వచ్చినట్లు చెప్పబడి యుండలేదు. అచ్చట వీరనాయకులు యుధ్ధమున కాజ్ఞయిమ్మని బ్రహ్మనాయని తొందఱపఱుపసాగిరికాని నీతివాక్యములచే నాతడు వారల వారించుచుండెను.

                    బాలనాయని కధ.
         ఇట్లుభయపక్షములవారును గార్యమపూడికి జనుదెంచి యుద్ధసన్నద్ధులై యుండగా నచ్చట వీరమేడపిలో బ్రహ్మనాయనిపుత్రుడైన బాలనాయుడు తోడిబాలురతో గూడి తల్లి యైతాంబ వారించినను వినక పోయి బొంగరము లాడుచుండం జూడవచ్చిన యమాలక్కలలో గోమటియన్నమ్మ మీగాలికి బాలునిబొంగరందాకి యామెమూర్చిల్లి పడిపోనట! పిమ్మట జుట్టును మూగియున్నయువతులు శైత్యోర్దిపచారములు సేయగా గొంతసడికిదెలివి గాంచి యాకోమటియన్నమ్మ పోగుసింగమువలె బోగరెక్కియున్నావు గాన ఉద్ధభూమిలో నున్నమీయయ్యలను గలిసికొన్నచో గండకావర