పుట:Andhrula Charitramu Part 2.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

     జననమరణములు జనులకు నిక్క
     మాలయంబున నున్న నడవిలో నున్నం
     దప్పకచార్కొన్ దధ్యంబు గాను
     బుణ్యలోకంబును బొందుమార్గముల
     వినిపించునేదల్లి విశదంబుగాను
     సజ్జనసంగతిసంసార మెడల
     గురువుబోధించిన గుఱిమీదమనసు
     నిలిపిమరణమొందు నిశ్చలు డొకడు
     ప్రాజ్యసాంరాజ్యసంరక్షణమందు
     ఘనరణమ్మున ఱొమ్ము గాయాలనొంద
     మనసుచలింపక మరణంబునొందు
     శౌర్యపరాక్రమసంపన్నుడొకడుఇ
     వీరలిద్దఱు లెస్స వినువీధి కేగి
     యాదిత్యమండలం బరుదార జించి
     పోయి పుణ్యంబుల భూమి జెందుదురు
     మొదటికార్యముబూను ముఖ్యతలేదు
     శౌర్యంబుచే మాకు సంపాద్య మగును"

     ఇట్లు వీరధర్మమును బోధించుట జూచి తనకుమారు డింక యుద్ధము నకు బోయి మరణము నొందగలవా డని నిశ్చయించి బెగ్గడిల్లును నెట్టేట్టి నీరులనో బోధించి యేట్టులయిన వానిచిత్తంబు మరలింపజూచెను. వాడు వినకుండుట జూచి తల్లి "నాయనా! నాహితవచనంబులు నీచెవినాటకున్నవి; పోయినవాడవు పొవుచునే యున్నావు గాన బోవునపుడు నీభార్య మాంచాలను జూచి మఱి పొమ్ము" అని యనుజ్ఞ నిచ్చెను. అట్లే యని బాలుడు తన యాఱుగురు సోదరులతో బయలుదేఱి మాగ్రమధ్యమున దన యుంపుడుకత్తె యైన సబ్బాయి యను వేశ్యయొక్క గృహంబునకుబోయి యామెతో సరససల్లాపాములాడి యుద్ధవార్తను దెలిపి యామెకు విశేష