పుట:Andhrula Charitramu Part 2.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వులమందలను దూరముగా దఱిమి చెదరగొట్టి వావలసినదని యుత్తరవు చేసి పంపించెను. అప్పుడాచెంచులును గిరాతకులును విశేష సైన్యములతో మందాడి పై దండెత్తివచ్చి నాయకురాలి యాజ్ఞాప్రకారము పసులమందలను జెదరగొట్టి యల్లరులు గవింప బ్రహ్మనాయని సేనాపతి యైన లంకన్నకును వారలకును భీమ సంగ్రేఅమంబు జరిగెను. ఆయుద్ధములో లంకన్న వీరస్వర్గమును జూఱగొనియెను గాని, బ్రహ్మనాయని పాదసేవకుడును మాలయు విష్ణుభక్తుడు నైన కన్నమనాయుడు శత్రుసైన్యముల నెదుర్కొని భయంకరముగా బోరాడి నాయకురాలిసైన్యములను మందాడినుండి పాఱిపోవునట్లుగ దఱిమితఱిమి గొట్టేను. అటుపిమ్మట బ్రహ్మనాయు డాప్రదేశమున నుండిన దనకు క్షేమము గలుగదని యూహించి కృష్ణదాటి దక్షిణముగా బోవలయునని నిశ్చయించెను.

             బ్రహ్మనాయుడు శ్రీశైలమునకు బోవుట.
     ఆప్రకారము బ్రహ్మనాయుడు సబంధు పరివారముగా రాచబిడ్డలను వెంటబెట్టుకొని  మందాడినివిడిచిపట్టి బయలువెడలి దొమ్మర్లదేవుకడ గృష్ణా నదిని దాటి మహాప్రసిద్దశివ క్షేత్రమగు శ్రీశైలమునకుబోయి శ్రీమల్లికార్జున స్వామిని సందర్శించి యర్చనాదికకృత్యములు నెఱవేర్చి యచటి రాజయిన మాకరాజునకు దనచరిత్రమునంతయు వివరించి తనఖడ్గమును గురువబెట్టుకొని కోటి సువర్ణముల నప్పుగానీయవలసిన దని యడిగెను. అతండందుల కంగీకరింపక 23 గ్రామములను గుత్తకునిచ్చెనట.1! అంతట బ్రహ్మనాయుడు త్రిపౌరాంతక క్షేత్రమునకు బోయి కొంతకాల మక్కడ నివసించియుండి మార్కాపురమున 'చెన్నారాయని ' పేరను విష్ణ్వాలయము నొకదాని నిర్మింపించి యటుపిమ్మట వీరమేడపి యనుపట్టణమునకు బోయి యచట నివసించుదుండెను. ఇచ్చట నుందగానే యేడుసంవత్సరములగడువుగడచెను. అప్పుడు బ్రహ్మనాయుడు

1. ఆగ్రామము లన్నియు కందవోలిమండలములోమార్కాపురముతాలూకాలో నున్నభాగమున నున్నవి. దానిలో మార్కాపురము, రూపాడు, చేపలమ డుగు, కోలకుణము, రాయిసముద్రము, గణపవరము, త్రిపురాంతకము, మేడపి ముఖ్యమైనవిగా జెప్పబడిఉయెను.