పుట:Andhrula Charitramu Part 2.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బంధు పుత్రకళత్రాదజనంబులతో విచారించి నలగామరాజు కడకు రాయబారమును బంప నిశ్చయించెను.

               రాచమల్లుని రాయబారము.
  రారమల్లు డనుబిరుదమును  వహించిన అలరాజు కళ్యాణపురాధీశ్వరుండైన వీరసోమునిమనుమడు. పెదమల్లదేవుని బావమఱిది యైనకొమ్మరాజుపుత్రుడు. పల్నాటిప్రభువైన నలగామరాజున కల్లుండు. ఈతనిభార్య పేరు రత్నాలపేరమ్మ, అలరాజమల్లునకున్ పెద్దనాయనికిని వివాదము తటస్థింపగా బ్రహ్మనాయుడు మధ్యవర్తియై తగవు దీర్చెను గాని, వారలసం గల మనస్పర్ధలు విడిచిపోలెదు. నాయకురాలికడకు రాయబారముపంపుట యపాయకరమైనది గావున నీతని బంపుట యుచిత మని సోదరులకు దోచినది. వైష్ణవభక్తాగ్రేసరుడైన బ్రహ్మనాయుడు రాచమల్లునకు బ్రాణాపాయము కలుగకుండ దులసి పే రిచ్చెను. ఈరాయబాఅ మలరాజుతలిదండ్రుల కెంత మాత్రము నిష్తము లెదు. ఏలన రాచమల్లుడును వానితల్లిదండ్రులును వీరశైవులు. రాచమల్లు తల్లిదండ్రుల నొప్పించి రాయబారమునుబూని గురిజాలకు బయలువెడలెను. తరువార బ్రహ్మనాయుడు దురాలోచనముచేసి  తులసిమాలికను మాయోపాయముచే గొనిరమ్మని కుమారు డైనబాలనాయని  వానివెనుకి బంపెను. బాలనాయుడు మార్గములో రాచమల్లుని గలిసికొని యొకకాలువనుదాటుటకై వానితొ బందెము వేసికొనియెను. రాచమల్లునిగుఱ్ఱముకాలువను దాటలెక యందులో దిగబడియెను.
      బాలనాయు డెక్కివచ్చిన గొఱ్ఱెపొట్టేలు కాలువను దాటకలిగెను. పందెము ప్రకారము రాచమల్లుడు తన మెడలోని తులసిమాల మొదలయిన యాభరణముల నిచ్చివేసెను. పిమ్మట అలరాజు గురిజాలకు సురక్షితముగా ప్రవేశించి మామగారిచే నర్హసత్కార్4అములనుపొందితన రాయబారమున్ నిందు పేరోలగమున నాతనికి విన్నవించెన్. మల్లదేవులకు భాగము నిచ్చి ప్రవాసమునకుబోయిన రాచవీరులు స్వదేశమునకు వచ్చుట కుత్తరువీయవల