పుట:Andhrula Charitramu Part 2.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఎవ్వరికోళ్లు ఓడిపోవునో వారు పట్టణమును రాజ్యమును విడిచి కృష్ణదాటి వలసపోయి యేడుసంవత్సరముల వఱకు బ్రవాసముననుండి యనంతరము రావలసి యుండు నన్న ప్రతిజ్ఞా పత్త్రముపై నురుపక్షముల వారును చేవ్రాళ్లు చేసిరి. బ్రహ్మనాయనిమిత్త్రుడైన బాలగోఫన్ననాయుడు మధ్యవర్తిగా నంగీకరింప బడియెను.1 అందఱు కత్యాశ్చర్యకరముగా బ్రహ్మనాయనికోడి నాయకురాలి పేరుగల పుంజులనెల్ల నొక్కొక్కదానిని నేలంగూర్చి మడియనటుల గొట్టుచుండెను. అపరాధమును నాయకురాలు భరింపజాలక మాయోపాయమున మఱియొకపుంజుచే బ్రహ్మనాయని పుంజును జంపించెను. ఇంక బ్రహ్మనాయనికి పుంజులు లెకపోయెను. దీని నంతత్యు వీక్షించుచున్న మధ్యవర్తి యైనబాలగోపన్న మహొదగ్రుడైలేచి యొక్కండే నాయకురాలి సైన్యంపైబడి ఘోరయుద్ధముచేసి నాశనముగావించెను. ఇతడు మువ్వలభీమన్నచే జంపబడగా గమనీడు వీని శిరమున్ గొనిపోయి బ్రహ్మనాయునిముందట బెట్టె ననియు, అతడు మంత్ర ప్రభావముచేఋత నాతని బునర్జీవుని గావించి మాచెర్ల పట్టణమును బరిపాలింప నియోగించి మలిదేవరాజాదులతో సబంధుసపరువారముగా సమయదీక్షనుబూని పట్టణమును విడిచిపెట్టి బయలు దేఱి యేలేశ్వరముకడ గృష్ణనుదాటి యరణ్యమున సంచరించుచు నచట మందాడి యనుపట్టణమును నిర్మింపించి, లంకన్న సేనాపతిగ నందు నివసించుచుండెననియు, చెప్పబడియెను.

                        కనమనాయని యుద్ధము.
     ఇట్లు బ్రహ్మనాయుడు సమయబద్ధుడై దేశమువిడిచి ప్రవాసముపోయినను బ్రహ్మనాయుడు బ్రైదికియున్నంతవఱకు దనకును దనప్రభువునకును క్షేమము కలుగదని నిరంతరమును దలపోయుచుండునదిగావున నాయకురలెట్లు ప్రతీకారము చింతింపక యూరకుండగలదు? అప్పుడు బ్రహ్మనాయుడు మందాడిలో సురక్షితముగా విశేషప్రాభవముతో వఱలుచున్నాడని విని యోర్వజాలక యడనిచెంచులను గిరారకులను రప్పించి బ్రహ్మనాయని పశు

1.బాలగోపన్ననాయుడు గొల్లవాడు.