పుట:Andhrula Charitramu Part 2.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బరిపాలనము సేయుచుండ నొకనాడు దానును తెప్పలినాయుడు1 అను వాడును, మృగయవినోదార్ధము నరణ్యమునకుం జని వర్లగొండ సామీప్యమున బసచేసి యుండిరి. అక్కడ నొక వ్యవసాయదారుడు కొన్నివిత్తనములను దెచ్చి రాజునకు కానుకగా నర్పించెను. ప్రభువు వానిని స్వీకరించి యంత:పురమౌన నుండురాణులకు బంపెను. వారలింక్ నట్టివిత్తనములు గానటయు నివి కోరగా దెప్పలినాయ డారైతులపొలములను దోచి విత్తనములను సంగ్రహించి తెచ్చెను. అట్టివిత్తనములతో వారెల్లరును గురిజాలకు వచ్చిరి. ఆవిత్తనములను గొల్లలబోయిన పొలము కాపఱులెల్లరును తమ దురవస్థనంతయు దమ యేలికకు విన్నవించుకొనిరి. అంతట నాయేలిక యాగ్రహోయత్తచిత్తుడై యలుగు భూపతికి భయంకరమైన సందేశమును బంపెను. దొడ్దనాయుడు తెప్పలినాయని9 తోట నర్లకొండపై దండయాత్రే వెడలెను. ఈదందయాత్ర వీరచరిత్రమున నత్యద్భుతముగా నభిచ్వర్ణింపబడినది. అప్పుడచ్చట వల్లకొండ ప్రభువునకును దొడ్డనాయనికిని భయంకరమైనయుద్ధము జరిగెను. ఆయిద్ధము లో వర్లకొందనాయకుడు మృతి నొందెను. వారిసైన్యము పలాయనమయ్యెను; వర్లగొంద శత్ర్తువులకు జిక్కి దోచుకొనబడియెను. ఇట్లు దొడ్డనాయుడు వినయముతో గురిజాల ప్రవేశించెను.

                    నాయకురాలి వృత్తాంతము.
    జిట్టగామాలపాడను నొకగ్రామమున చౌదరైరామిరెడ్డి యనుపేరుగల యొకెబీదరైతు పొలములో బసచేసికొనుచుండగా నాసమీపమునం దున్న కంచెలో నొక యాడశిసువు కాన్పించెను. ఆరైరు శిశువును గొనిపోయి పెంచుదుండెను. ఈశిశుమాత్రమేగాక యాతని కాదినమున బూమిలో నుండి ధనముకూడ లభించెను. అత్ర డాధనముతో భాగ్యవంతుడయ్యెను. నిజపుత్రికనుంబోలెవ్ బెంచి పద్దదానిగజేసెను. తరువాత రామిరెడ్డి యీమె నొకనికిచ్చి వివాహము జేసెను కాని, యత్యంతశీఘ్రకాలములోనే
                         ------

1.ఇతడు మాలవాడు.