పుట:Andhrula Charitramu Part 2.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తండ్రియు భర్తయు గూడ మృతి నొందుట సంభవించి వారల యైశ్వర్యమంతయు నీమెకే సంప్రాప్తమయ్యెను. తన యైశ్వర్యబలముచే నీమె దేశమున నొక ప్రముఖురాలుగ నుండి యాత్మశక్తిచేట నెట్లట్లో యనుగురాజుయొక్క అనుగ్రహమును సంపాదించి నాయకురాలను బిరుదునామమును వహించి ప్రఖ్యాతి గాంచెను. ఇట్లు తన నేర్పుచేత రాజును వశపఱచుకొని మంత్రాంగము చేసి యెట్లయిననేమి యనుగురాజునకును దొడ్డనాయునికిని విరోధము గల్పించెను. అంతట దొడ్డనాయుడీమె దుర్మంత్రమువలన మంత్రి పదవిని తన రెండచకూరుడైన బ్రహ్మనాయినికి విడిచిపెట్టి తాను దొలంగెను. బ్రహ్మనాయుడు స్వప్రయోజనపరుడై తన ప్రభువైన యలుగురాజును జంపించెను. తరువార దొడ్డనాయుడును మరణము నొందెను.1

                నాయకురాలి దుస్తంత్రములు
     అలుగురాజు స్వర్గస్థు డైన వెనుక నలగామరాజు పట్టాభిషిక్తుడయ్యెను. ఒకనాదు నలగామరాజు స్వపరివారముతో వేటాడ నరణ్యమునకు బోయి యుందుండు బెక్కుమెకంబుల వేటాడి భరింపరాని సూర్యాతపంబున జిక్కి మిక్కిలి దప్పికొని విశ్రమింప దగినతావును వెదకికొనుచువచ్చుచుండెను. నాయకురాలు రాజమార్గమున వచ్చునని ముందుగానే తన బుద్ధిచే నూహించి యామార్గమున నొక చల్లని ప్రదేశమున బయలుపందిరి వేయించి స్నానంబునకు నొష్ణోదకమును పానంబునకు శుద్దొదకమును సమకూర్పించి షడ్రసోపేత మైన భోజనమున కనుకూలము లగు పదార్దములను సిద్ధముచేయించి తన పభువునకై యెదురుచూచుదుండెనట! నలగామరాజాప్రదేశమునకు విచ్చేసి నాయకురాలిచే నాహూతుడై యచట నిలిచి యామెయొక్క యాతిధ్యమును సంతోషపూర్వకముగా గైకొనియెను. అతని కప్పుడాప్రదేశముమంతయు భూతల స్వర్గముగా నుండెను. అతడు సంతొషసాగరమున దేలుచున్నసమయమును గనిపెట్టి నాయకురాలు ప్రభువునకు మాఱుగా దాను కొన్నిగడియలు ప్రభుత్వము చేయుట కనుగ్రహింప వలసినదని

1.బ్రహ్మనాయుడు తనతండ్రినిగూద నలుగురాజుతో స్వర్గమునకంపెనని చెప్పబడియె.