పుట:Andhrula Charitramu Part 2.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బ్రోత్సహిమసాగిరి. అతండును మాయోపాయంబున నాతని గడతేర్చి కుల గౌరవమును నిలుపకొనవలయునని యోజించెను. ఇంతవఱకు రౌతులననేకులను జం[పి మరించి యాప్రఖ్యాతి గాంచియుండిన గందర్వాశ్వమున్ బహుమానము జెసిన నయ్యది వానిం దప్పక చంపు ననియు, అంతట దనకొమార్తె ముక్తలవాంబ వానితో సహగమనము జేయుననియు, అంతటితో వారివలన గలుగబొయెడు నగౌరవమంతయు దొలంగు ననియు నూహించి యతం డాగుఱ్ఱము నల్లునకు బహుమానము జేసెను. తానొకటితలంచిన దైవము వేఱొకటి తలంచు నను నట్లుగా నమ్మహాకార్యమువలన బె3ద్దన చచ్చుటకు మాఱుగా వారలెల్లరు జచ్చుట సంభవించినది. పెద్దన స్వారిచేయుటయందు గడతేఱిన రౌతు గావున నతం డాగుఱ్ఱము నెక్కినతోడనే యది వానియొక్క సామర్ధ్యము దెలిసికొని వానిం గడతేర్చుట యసాధ్యమని భావించి వశవర్తియై వాయువేగమున పఱువిడ సాగెను. అతనిరాక యెప్పటికిని గానరాకపోయినందున నాయశ్వమతనిం జంపియుండు నని యెల్లవరుని నిశ్చయించిరి. తన భర్తమరణమునకు మిక్కిలి దు:ఖించి ముక్తలవాంబ బ్రదుకునం దాస విదిచి భర్తతో సహగమనముజేయ దలపోసి తన యభీష్టముమును తల్లితండ్లులకు సహోదరులకు జెప్పి చితిని పేర్పించి యగ్నిని రాకొల్పి యందులో దుముక సంసిద్దురాలయి యున్న సమయమున బెద్దన యాయశ్వముతో వాయువేగమున వచ్చి యామెను బట్తికొని పోయి తనప్రక్క నుంచుకొని తన బావమఱదులతోడ బోరాడి వారలనెల్లర నుక్కడించి యాపట్టణమును నాశనము గావించి ంహాపౌరుషమును జూపి పిమ్మట దనపిట్టినయింటికి బోయి తన తల్లిదండ్రులకును బంధుజనంబులకు నమితానందము గలుగజేసి హయా రూఢదేవంబు డను మహాబిరుదముగాంచి పల్నాటివీరులలో సుప్రసిద్ధుడయ్యెను. వీరిచరిత్రమునం దీతనిచర్య లత్యద్భుతముగా నభివర్ణీంపబదినవి.

                      నర్లకొండ దండయాత్ర.
      తరువాత దొడ్డనాయుడు మంత్రిఅగ ననుగురాజు ప్రజారంజకముగ