పుట:Andhrula Charitramu Part 2.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లక్షు బంపబడిన దూత ఇట్లు క్షత్రియు లెవ్వరును శూద్రునకు గన్యక నిచ్చుట కొడంబడకపోవుటచేత విసిగి వేసారి తుదకు నాంధ్రదేశములోని చందవోలునకు విచ్చేసిరి.1 అచ్చట నొకబ్రాహ్మణు డనుగ్రహించి వారలకు నొక్కయుపాయము చెప్పెను. క్షత్రియుండైన కృష్టగంధర్వుని కడకు బోయి పెద్దనదత్తపుత్రు డని చెప్పక మాటలాడి యాతనికూతురయిన ముక్తలమాంబ నిప్పించి వివాహకార్యము నెఱవేర్చు టుచిత మని యాతడు చెప్పెను. ఆయుపాయ మనుకూలముగ నున్నదని భావించి దూతకృత్యమును నెఱవేర్చెడి బ్రాహ్మణులు కంచెర్లనగరమునకు కృష్ణగంధర్వుని సందర్శించి దత్తస్వెకారము సంగతి నెత్తకయే తమసందేశమును దెలిపిరి. అంతట కృష్ణగంధర్వుం డలుగురాజుతోడి బాంధవ్యమున కపరిమితానందమును బొంది పెద్దనకుదన చిన్నకుమార్తె యయిన ముక్తలవాంబ నొసంగి వివాహము జేయుటకు సమ్మతించెను. పిమ్మట బ్రాహ్మణులు గురజాల కేతెంచి యాశుభవృత్తాంతము నంతయు నలుగురాజునకు జెప్పి యాతనివలన విశేషబహుమానములను బొందిరి. అటుపిమ్మట నలుగురాజు దైవజ్ఞ లయిన ఎద్దలవలన నొక శుభముహూర్తమును విచారించి బంధుపరివారసమేతముగా గంచెర్లకు దరలిపోయి యాశుభముఇహూర్తమున బెద్దనకును ముక్తలవాంబలకును వివాహమును గావించి పెద్దన నత్తవారింట విడిచి నిజరాధానికి మరలి వచ్చిరి. అత్తవారింట నున్నకాలమున బెద్దన తన బావమఱదులతో వనవిహారాదిక్ర్తీడావినోదంబుల బ్రొద్దుపుచ్చుచు దన యశ్వవిద్యానైపుణ్యమును బరాక్రమమును జూపుచు వారలకు దనపట్ల నసూయ జనింపజెయుకార్యములను జేయుచుండెను. ఇట్లుండ వారలకు నితండు శూద్రుం డనియు ననుగురాజు దత్తపుత్రుండనియు దెలియవచ్చెను. ఇయ్యది విన్నతోడనే వారలాగ్రహించి పెద్దనాయని జంపజూచిరికాని యెదుర్కొంటకు సాహసింపజాలక యెట్లయిన యీతని బరిమార్చు నుపాయ మాలోచింపుమని తిడ్రినీ


1.చందవోనికి దనపురము మని నామాంతరము గలదు. అనుగురాజును అలుగురాజునికూడ చెప్పిరి.