పుట:Andhrula Charitramu Part 2.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వెలనాటిరాజులతోడి సంబంధముచేతనే హైహయరాజు ల నేకులు వేంగీదేసములో (గుంటూరు, కృష్ణా, గోదావరి మండలములలో) సామంతపదవులను వహించి పండ్రెడవశతాబ్దప్రారంభమునను బ్రసిద్ధిగాంచిరి. కృష్ణా, గొదావరి మండలములలో బరిపాలనము చేసిన కోనసీమరాజు లెల్లరును హైహయరాజులే యనియు; పల్నాటిహైహయులున్ కోనసీమ హైహయులును, చాళుక్యులు ఈదేశమును జయించినప్పుడు వారితోంగాని గజనీమామూదు మహమ్మదుగోరీల కాలములోగాని, యాంధ్రదేశమునకు వచ్చియుందురు. పల్నాటిలోని శాసనములలో బేర్కొనబడిన చాగిదేశరాజునకే యనుగురాజును నామాంతరము గలదేమో యని సందేహము కలుగుచున్నది. అయిననుగాకపోయునను శాసనములోని చాగిరాజకుటుంబములోనివారే యీయనుగురాజు మొదలగు వారని మనము నిస్సంశయముగా విశ్వసింపవచ్చును. అనుగురాజునకు మొదట సంతానము లేకపోయినదట. అంతట క్షత్రియుడైన యనుగురాజు తన మంత్రియైన దొడ్డనాయని పుత్రుడగు చాదన్నను బెంచుకొనిల్యెనట! 1

    పెద్దనాయని బెంచుకొన్నతరువాతనే మూవురురాణులయందును రాజునకు సంతానము గలుగుట సంభవించెను. రేచెర్లదొడ్డనాయనికి కీలమ్మయందు పెద్దనాయుడు, బ్రహ్మనాయుడు, సూరినీడు, పేరినీడు, మల్లినీడు, అను నెవురు పుత్రులు జనించి పంచపాండవులవలెవ్ బరాక్రమవంతులై తేజోధికులై యొప్పు చుందిరి. వారిలోబాదన్నగొప్ప రౌతు; బ్రహ్మనాయుడు రజకార్యధురంధరుడును మహావీరుడునైయుండెను.
    
                          పెద్దనాయని కధ.
   అనుగురాజు తన మంత్రి యైన రేచెర్లదొడ్డనాయనిపుత్రుడగు పెద్దనాయని బెంచుకొని యాతనికి వివాహము జేయ నిశ్చయింపగా నాతనికి క్షత్రియు లెవ్వరు గన్య నీయకపోయిరంట అనుగురాజుదే దేశదేశంబు

1. బాసన్నకే పెద్దన లేకపద్దవాడని నామాంతరము గలదు పెద్దనయనియే కొన్నిగ్రంధములందు వక్కాణీంపబడెను.