పుట:Andhrula Charitramu Part 2.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తోను, తనకుటుంబముతోను, తనకులదేవతలతోను, స్వరాష్ట్రమును విడిచి పాప పరిహారార్ధమై తీర్ధయాత్రలు సేయగొరి నానాక్షేత్రంబులు కరుగుచు పుణ్యనదులలో మునుంగుచు నాంధ్రదేశమునకు వచ్చి యమరావతిరేవున కృష్ణాననదిలో స్నానముచేయగా నల్లనిజీడిమానెగుడ్డలు తెల్లనివాయెనట! ఇట్లు తెల్లనగునని బ్రాహ్మణోత్తములు చెప్పుటవలననే యనుగురాజు స్వదేశమును విడిచి యీదేశ మునకు రాగలుగుట తటస్థమైనదట! 1. ఈదేశమునకువచ్చి యనుంగురాజు వెలనాటిరాజవంశములో జేరిన యొకకన్యను వివాహము జేసికొనియెనట! ఆమె పేరు మైలమదేవి. చందవోలురాజధానిగ వేంగీదేశమును రాజప్రతినిధిగనుండి పరిపాలనము సేయు మైలమదేవునితండ్రి కూతునకు బల్నాడరణముగా నొసంగి నందున నమగురాజు గురిజాల రాజధానిగ బల్నాటి కధిపతియై ప్రజాపరిపాలనము సేయుచుండెనట ! ఇతనికి రేచెర్ల బేతినాయనికొడుకు, దొడ్డనాయుడు మంత్రిగ నుండెను. అనుగురాజునకు మైలమదేవి, వీరవిద్యాదేవి (విజ్జలదేవి,)భూమాదేవి యను మువ్వురు భార్యలు గలరు.2 వీరిలో మైలమదేవికి నలగామరాజును, వీరవిద్యాదేవికి బెదమల్లదేవుడు, పినమల్లదేవుడు, బలమల్లదేవుడును; భూరమదేవికి గామరాజు, నరసింగరాజు, ఝుట్టిరాజు, పెరుమాళ్లరాజును జనించిరి. వెలనాటిరాజులు శూద్రుల మని చెప్పు కొన్నవారు. కార్తవీర్యార్జునుని సంతతివారయిన హైహయు లయిన గళచురి రాజులు క్షత్రియుల మని చెప్పుకొన్నారు. ఇట్టి వివాహములాకాలమునం దనేకములు జరుగుచున్నందులకు దృష్టాంతము లనేకములు శాసనములలో గానంబడుచున్నది. చతుర్ధాన్వయసంబవు లయిన


1.హైహయులు చేదిదేశమునుండి వచ్చినవారు. వీరిని గళచురి రాజులందురు.వీరు చేరిదేశమున మాత్రమేగాక చాళుక్యులకాలమున గోలకణదేశమునం దుండిరి. బుండేలుఖండములోనుండు కాతరుకోట హైయయులచే, పరుడొకండవశతాబ్దమునం దుండిరి. బుందేలుఖండేలు ఖండములో నుండుకాతరుకోట హైహయులచే, పరుడొకండవశతాబ్దమున గజమామూడును, పండ్రెండవశతాబ్ద ప్రారంభమున మహమ్మదుగొరియు, వీరిపై దండెత్తివచ్చుటచేత నుత్తరమున నున్న హైహయులు దక్షిణమునకు వచ్చిరి.

   (2) మైలమదేవికి వీరవిద్యాదేవి యను నామాంతరము గలదని ముభెగాండనిధభద్రకవి యిరువురుభార్యలనే వక్కాణించెను.