పుట:Andhrula Charitramu Part 2.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప ల నా టి వీ ర చ రి త్ర ము

                           -----
  మొదటి ప్రతాపరుద్రునకు సమకాలికులయిన పల్నాటివీరులచరిత్రమును సంగ్రఃహముగా నీ ప్రకరణమున వివరింపబోవుచున్నాడను. పండ్రెండవశతాబ్ద ప్రారంబమున పల్నాడు పశ్చిమ చాళుక్యచక్రవర్తులకు సామంతులుగ నుండిన హైహయవంశజులయిన గళచుఱిరాజులచే బరిపాలింపబడుచుండెను.1 బిరుదాంకరుద్రుడను నామాంతరముగల చాగిబేతరాజు పల్నాటికి బ్రభువై భూలోకమల్లు డను పశ్చిమచాళుక్యచక్రవర్తికి గప్పము గట్టుచుండె నని మొదటి ప్రకరణమున జెప్పియున్నాడను.2 ఇతడు కామనూరుగ్రామవాస్తవ్యుడు ఋగ్వేదపదపాఠియు నగు నొక బ్రాహ్మణినిచే మాధవిపట్టణమున బ్రతిష్ఠింపబడిన త్రిమూర్తి దేవాలయమునకి శా.శ. 1041 సౌమ్యసంవత్సరము క్రీ.శ. 112-30 దాన శాసనమున్ వ్రాయించెను. ఇందు జెప్ప

1.పల్నాడనునది గుంటూరుజిల్లాలో నొకతాలూకా యయున్నది. ఇయ్యది కృష్ణానదీతీరమున సముద్రమునకి నించుమించుగా 120 మైళ్లదూరంలో నున్నది. ఈసీమకు ఉత్తరమునకు పడమరకు 14 మైళ్ల పొడవున కృష్ణానది ప్రవహించుచున్నది. దీని దక్షిణభారముకొండలచేతను దట్టమయిన అడవులచేతను నావరింపబడి యున్నదిగను తూర్పున చిట్టడవులు మాత్రమే వ్యాపించియున్నవి. దీనియొక్క వైశాల్యము1140 చదరపుమైళ్లుండును. నాగులేఱు, చంద్రవంక, యుపనదులు దీనిగుండ ప్రవహించుచున్నవి. ఈభూప్రదేశము చరిత్రకాలమునకు బూర్వమునుండియు బ్రఖ్య్హాతి వహించి యున్నది. ఇది మొదలు వాగులకు నివాసభూమిగ నుండి యంధ్రభృత్యవంక రాజుల పరిపాలనకాలమున బల్లవులచే నాక్రమింపంబడి వల్లవా డానివేరు సోధీని తరు వాత దనియు, పల్నాడనియు వ్యవహరింపబడుచున్నది. చారుత్రాంశములు నెఱుంగని కొంద ఱాంద్రకవులు పల్లెనాడని గ్రంధస్థము గావించిరి.తక్కిన వ్యుత్పత్తులంతగా బాటింపమని లేదు.

2.రెండవభాగము మొదటిప్రకరణము 14-154 పేజీలను చూడుడు.