పుట:Andhrula Charitramu Part 2.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసనములో నభివర్ణింపంబడి బ్రదికియున్న యామెపుత్రుడు మల్లానాయు డనెడు దొడ్డనాయుడు ముప్పదిసంవత్సరములకు బూర్వమే మృతినొందనలపిన దురవపట్టినదిగదా! ఆయాగ్రంధములలో నుండువిషయములను విచారింపక కల్పితగాధలను బట్టు పొగడ్తలను నమ్మి వంశవృక్షములను గూర్చినచో బరిత్రకారులు తప్పక పరిహసఫాత్రులు గాక మానరు. కాబట్టి తేలినపర్యవసాన మేమనగా, వెలుగోటివారివంశచ్రిత్రమును, తద్వంశవృక్షమును చరిత్రమునకు విరుద్ధముగా గూర్పబడియున్నవనియు, వానిని సంస్కరింపించు కోవలసియున్నదనియు స్పష్టమగుచున్నది. రేచర్ల పిల్లలమఱ్ఱి బేతిరెడ్డి వేంకటగిరి, పిఠాపురము, మైలవరము, జటప్రోలు,బొబ్బిలి సంస్థానాదిపతులకు మూలపురుషుడు కాడనియు, పల్నాటివీరు డైనబ్రహ్మనాయడీపిల్లలమఱ్ఱి బేతిరెడ్డికి మనుమడు గాడనియు, ఈబేతిరెడ్డికి మల్లారెడ్డియనుకొడు కొక్కడేగలడనియు, సిద్ధాంతమగుచున్నది. వెలుగోటివారిపూర్వు లయిన యనపోతిరెడ్డినాయుడను, మాధవనాయుడను, వారివంశంములలో వ్చెన్నమనాయని నుండియే తమపూర్వులన్ జెప్పుకొని యున్నారుగాని పిల్లలమఱ్ఱిబేతిరెడ్డిని మూలపురుషునిగా జెప్పికొనియుండలేదు. సర్వజ్ఞసింగమనాయుడు సయితము తన సింగభూపాలీయమున 4 గవతరములోని దాచినాయనిమొదలుకొని వంశజులను వర్ణించెనుగాని సుప్రసిద్దు లయిన బేతిరెడ్డిమొదలగువారినెవ్వరినిని బేర్కొనియుండలేదు. ఇప్పటివారికంట వారు ప్రాచీనులుగనుక వారి కీగాధల పూర్వోత్తసందర్భములు చక్కంగా దెలిసియుండవలయునుగదా? వారేల తమశాసనములందును గ్రంధములందును సుప్రసిద్ధవంశజులనభిచ్వర్ణింపక మౌనధారణము కలిగియుందురు?

                    -----------