పుట:Andhrula Charitramu Part 2.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బడిన మాధవీపట్టణము గురివిందస్ధలమనియు గురజాల యనియు జెప్పబడు చున్నది పల్నాటిలోని మాచెర్లగ్రామములోని చెన్నెకేశవస్వామి దేవాలయములో నింకొక శాసనము పండ్రెండవశత్యాప్రారంభమునాటిది గలదు. పల్నాటికి రాజధాని యగు మహాదేవి తటాకము (మాచెర్ల) లో నొకానొక యాదిత్యునిచే నాదిత్యేశ్వర దేవాలయము నిర్మింపబడినది. చంద్రకులమునందు జనించిన కార్తవీర్యార్జునుని చ్వంశమునందు బుట్టిన చాగిదేబేతరాజు నలుగురు కుమారులలోను రెండవ వాడగు వీరకామునికుమారుండు బేతరాజు దీనికి భూదానము చేసియుండెను. హైహయవంశజు లయిన యీరాజులు పండ్రెండవ శత్యాబ్దప్రారంభమునందు బల్నాటికి ప్రభువులై పరిపాలించు చున్నవిషయము వాస్తవ మని పైశాసనము లంబట్టి స్పష్ట మగుచున్నది. ఈరాజుల యొక్క చరిత్రమే పల్నాటివీరచరిత్ర మను పేర బెక్కండ్రు తెలుగుకవులచే ద్వంధరూపమున వ్రాయబడి యాంధ్రదేశమున బఠింప బడుచున్నది. ఈ గ్రంధమున కనేక పాఠాంతరములు గలవు.1 ఈగ్రంధములన్నిటిలో శ్రీనాధకవిప్రణెవెత మైనదని చెప్పబడు గ్రంధము మాత్రము ప్రాచీనమైనదని దోచుచున్నది. పాఠాంతర భేదములను విడిచి నేను గ్రహించిన కధాసారమును మాత్రమే యిందు వివరింపబోవు వున్నాడను. ఉత్తర హిందూస్థానమున బాలమాచాపురి యనుపట్టణము గలదు. దానికి జంభనాపుర మని నామాంతరము గలదు. ఆపట్టణమును గార్తవీర్యార్జునునకు నేడవ తరమువాడైన యనుగు రా జేలుచుండెను. కార్తవీర్యార్జునునకు నేడవ తరమువాడైన యనుగురాజేలుచుండెను. కార్తవీర్యార్జునుడు చేసిన పాపములు తన్ను బాధింపగా ననుగురాజు విదగ్దులగు విప్రవర్యుల యాలోచనము గైకొని జీడినూనెగుడ్డలుధరించి తనసైన్యముతోను, తనమంత్రులతోను, తనధనము


1.పల్నాటిచరిత్రమును శ్రీనాధకవి, కొండయ, మల్లన, బలగానుసెట్టి, ముగిగొండవీరణ యున్నారు వీరిలో శ్రీనాధుని గ్రంధము ప్రాచీనము ఈ శ్రీనాధుడు తను రచించిన కవిసార్వభౌముడే యని చెప్పుచున్నాడు గాని, యీయశుడు వీక్షించినప్పుడీగ్రంధ మా మహాకలివిరచతము కాదేమో యని ముదిగొండవీరభద్రకవిగ్రంధము క్రీ.శ. 1262 వ సంవత్సరమున ఇది పద్యకావ్యము. పాఠాంతరబేదము లనేకములు గలవు.