పుట:Andhrula Charitramu Part 2.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జేసి రాచవారయిరి. ఇక్కాలమునందు వీరిని రాజపుత్రులనుట ధర్మమగును. ఉత్తరదేశమునందలి రాజపుత్రులును వీరి వలెనే చతుర్థకులము నుండి వచ్చినవారే యగుట చేత నీరాచవారు వర్ణమునందు దాము తక్కువవారమనియు, ఉత్తర దేశపురాజ పుత్రులెక్కువ వారని చింతింపనక్కరలేదు. ఇట్లని యొరులు వీరిని నధిక్షేపింపరాదు. గుణకర్మములచేత వర్ణవిభాగమేర్పడినది కాని వర్ణాశ్రమధర్మము లేర్పడుటకు బూర్వమునందరు సమానులే యని యెరుంగవలెను.

చరిత్రసాధనములు

ఈ చరిత్ర రచనమునందు నాకు విశేషముగా దోడ్పడినవి శాసనములు, ప్రబంధములు. శాసనములు ఇండియన్ అంటిక్వేరి, ఎపిగ్రాఫికాఇండికా, ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారములో మెకంజీ, ఎల్లియాట్, మొదలగువారిచే భద్రపరుపబడిన "లోకల్ రికార్డ్స్"అను సంపుటములలోనుండి గ్రహింపబడినవిగా నెరుంగవలయును. కొన్ని శాసనములు శ్రీమానవల్లి రామకృష్ణకవి, ఎం.ఏ.,గారు దయచేసినారు. ఈ చరిత్ర రచనమునందు వీరి సాహాయ్యము నాకు బ్రధానమైనదిగా నున్నది గావున వీరికి నేను మిక్కిలి కృతజ్ఞుడనై యుండవలయును. రావుబహదరు వి.వెంకయ్య, ఎం.ఏ., గారు ఇండియన్ ఆంటిక్వేరీలో వ్రాసినదానిని నాధారముగా జేసికొని నెల్లూరు శాసనసంపుటములను ఆంధ్రప్రబంధములను బరిశీలించి నెల్లూరు