పుట:Andhrula Charitramu Part 2.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చరిత్రమును వ్రాసినాడను. కాకతీయులచరిత్ర రచనమునందు శాసనపరిశోధకులగు రావు సాహెబు హెచ్.కృష్ణశాస్త్రి బి.ఏ.గారి యనుమకొండ శాసనవ్యాఖ్యానము గూడ తోడ్పడినది. పల్నాటివీరులను గూర్చిన చరిత్రము ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారములోని ద్విపద ప్రబంధములను జదివి యందలి కథాసారమును గ్రహించితిని. మనోహరముగా నుండుటకై శ్రీయుతులైన అక్కిరాజు ఉమాకాంతము గారు విశేషపరిశ్రమ చేసి వ్రాసిన ఉపోద్ఘాతముతో గూడిన పల్నాటి వీరచరిత్రములోని బాలచంద్రయుద్ధభాగమునుండి ద్విపద పంక్తులనచ్చటచ్చట నుదాహరించుచు వచ్చినాడను. మరికొన్ని భాండాగారములోని ప్రతులనుండి గ్రహించితిని. ఉమాకాంతము గారు ప్రకటించిన భాగము శ్రీనాథవిరచితమైన గ్రంథములోనిదియేనాయని యొక గొప్ప సందేహము కలుగుచున్నది. ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారములోని ప్రతులయోమయావస్థలోనున్నవి. రావు వంశీయ చరిత్రము యొక్క ప్రతిని శ్రీ బొద్దికూరపాటి వేంకటరంగము నాయుడు గారు దయతో నాకొసంగిరి. ఈ గ్రంథమును రచించినవారు కీర్తిశేషులయిన గురజాడ శ్రీరామమూర్తిపంతులుగారు. ఈ గ్రంథకర్తలకందరకును కృతజ్ఞుడనగుచున్నాడను.


ఈ చరిత్రములో బ్రకటించిన దేవాలయ పటములందు ఓరుగల్లునుండి పంపిన నా మిత్రులగు శ్రీయుత మాడపాటి