పుట:Andhrula Charitramu Part 2.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
వెలుగోటివారి వంశచరిత్రము

శ్రీవేంకటగిరి సంస్థానాధీశ్వరులైన మహారాజశ్రీ శ్రీ మహారాజా గోపాలకృష్ణయాచేంద్ర బహాదూర్ కె.సి.ఐ.ఇ. వారు నా ప్రార్థన నంగీకరించి వెలుగోటివారి వంశచరిత్రముయొక్క ప్రతి నొకదానిని దయచేయగా వందనపూర్వకముగా స్వీకరించి యామూలాగ్రముగా బఠించితిని. అందు చరిత్రబద్ధములు కాని విషయములనేకములుండుట చేత నా యభిప్రాయభేదమును తెలుపవలసి వచ్చినది. అందులకు మిక్కిలి చింతించుచున్నాను. చరిత్రమునందు వారి వంశవిషయమై నే జేసిన సిద్ధాంతములను సహేతుకముగా దోషములని నిరూపించినయెడల వానిని దీనికనుబంధముగా ప్రకటింతును.

రాచకొలమువారు

ఈ చరిత్రమును జదివినప్పుడు వర్తమాన కాలమున నాంధ్రదేశమునందు క్షత్రియులనియు, రాజపుత్రులనియు వ్యవహరింపబడుచున్న రాచవారు బలిజ, కమ్మ, వెలమ, రెడ్డి తెగలలోనుండి యేర్పడిన యొక ప్రత్యేక కులమని బోధపడగలదు. వీరి ప్రాచీనులు శాసనములలో జతుర్థకులము వారమని చెప్పుకొనియున్నారు. ఇయ్యది నేను తెచ్చిపెట్టిన కల్పనముకాదు. వీరి ప్రాచీనులు జనరంజకముగా బరిపాలనము చేసి రాజులనిపించుకొన్నట్లు శాసనములు ఘోషించుచున్నవి. అట్టి రాజులయొక్కయు వారి బంధువర్గము యొక్కయు సంతతి వారగుట