పుట:Andhrula Charitramu Part 2.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"చ. కనుగొనివచ్చి రేచడతిశాతుక మొప్పంగ రెడ్డిసన్నిధిన్
      వినుతవిధేయుడై యపుడు వేడుకమీఱగ విన్నవింపగా
      ఘను డరుదెంచి చూచి కుతకంబున సాంతముగా బఠించి తా
      ననియెను రెండులక్షలపదార్ధములుండెనటంచు వానితోన్."

అని వ్రాయబడినది. కాని వేంకటగిరివంశావళిలో:--

"గీ. కడునియంబున రేచని గారిది యనట
      గంటె నవలక్షవిత్తంబు గలదు నరుని
      బలి యొసగి దీని గైకొనవలయు ననుచు
      వ్రాసియున్నది నిక్క మీశాసనమున.."

అని రేచనితో జెవిరెడ్డి చెప్పినట్లు భేదముగా నున్నదిగాని హేమాద్రైరెడ్డి ప్రశంస నెవ్వ రెత్తియుండలేదు. రేచడు మూడువరములు గోరినట్లు పద్మనాయక చరిత్రమునందును, నాలుగు వరము లిచ్చినట్లు వేంకటగిరివంశావళి యందును జెప్పబడి యుండగా వేంకటగిరిరాజులవంశ చరిత్ర యను నీ నూతన గ్రంధమున నొక్కవరమే పేర్కొనబడి యున్నది. తక్కిన వరముల సంగతులు నమిరెడ్డి, ఎఱ్ఱక్కసానిశాసనము;లవ;అమ నసత్యములుగ నేర్పడి నవి గనుకను, వారియింద్ల వివాహములు జరుగునప్పుడు మాలవాండ్రకు గూడ వివాహముచేయు నాచారము ఇప్పటికిగూడ జరుగుచున్నది గనూ నీ వివాహమును మాత్రమే పేర్కొని రేచనిపేరిట రేచర్త్లగోత్రము బెట్టుకొనుట మొదలగునవి విడిచిపట్టవలసి వచ్చినది. కాకతిగణపతిదేవరాజు చెవిరెడ్దిని సమ్మానించిన తరువాత,

"క. నాడాదిగ సుకవీంద్రులు
     వేడుక బేతాళు డనుచు వేమఱు దిశలన్
     బోడిమి మతింప విమతుల
     కోడక యవ్విభుడు ధాత్రి నొగి జెలువొందెన్."

అని చప్పబడి యుండగా నూతనగ్రంధమునందు   బేతాళనాయుడని గణపతిదేవుడు పౌరుష నామ మొసంగె నని చెప్పబడియున్నది.ఇట్లీ గ్రంధము