పుట:Andhrula Charitramu Part 2.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మెచ్చుకొని యామనిగంటిరాజ్యముతో జేరిన లక్కసీమను, గజహయాదులను, కల్కితురాయిని, కిరీటమును, కాలికిగండపెండేర మనెడు బిరుదాభరణమును, చత్రచామరములను, బంగారుపూతపని గలయొకచౌకళీకత్తిని బహుమతిగా నొసంగి, పిల్లలమఱ్ఱి బేతాళనాయుడను పౌరుషనామమిచ్చి పంపించెనట! ఆకత్తి యిప్పటికి సంస్థానములో బూజింపబదుచున్నదట.!

   ఇది వేంకటగిరురాజులవంశచరిత్రమును వ్రాసిన గ్రంధకర్తలయొక్క నవీన కల్పనమన్ ఘంటాపధముగా జెప్పవచ్చును. ఇదివఱకు బద్మనాయకచరిత్రము నందును, వెలుగోటివారివంశావళియందును, రావువంశీయుల చరిత్రము నందును వ్రాయబడిన గాధలకు బ్రత్యక్షవిరుద్ధముగా నున్నది. ఆగ్రంధములలోని యసంద్భాము లైనగాధలను జూచి వీరిట్టి నవీనకల్పనకు వెనుదీయరైరి. హేమాద్రిరెడ్ది ధనమును పాతిపెట్టి శిలాశాసనము వ్రాయించెననునది వీరు కల్పించిరి. చెవిరెడ్డి బీదవాడై యారుగంటిలో వీరభటుడై కొన్ని దినములు గడిపె నని పూర్వగాధలలో నున్నది.

       "ఉ. అంత నకించనాస్తిని మహాబలు డప్పుడు బేరిసీమలో
             వింతగ నింపుసొంపెసగ వేమఱు నామనగంటిలోపలన్
             పంతము మీఱ చౌదరులపాటిని బిన్న పెద్దయై
             కాంతివహించె నచ్చటను గోరిక దా వ్యవసాయసాయతిన్."

అని వేంకటగిరివంశావళి గ్రంధమున వ్రాయబడి. "అట్టివ్యవసాయమునకు బాలికాపుగా రేచ డనునొక పంచముని నిర్ణయించి యుంచెను. నిత్యమును వానికి నియోగింపవలసినపనులు నిర్ణయించి చెప్పుచుండును." అని రాజవంశీయుల చరిత్రమునందు వ్రాయబడి యున్నది. చెవిరెడ్డి యాయువతిని రేచడు నాగభైరవునిగుడికడ నున్న యొకపొలమును దున్నుచుందగా నాగటికి దగిలి యొకశాసనము గనుపట్టె నని మాత్రమే చెప్ప బనది. చెవిరెడ్డి యాశాసనమును జదివి రేచనితో రెండులక్షల ధన మున్నదని చెప్పినట్లుగా పద్మనాయకచరిత్రములో నీక్రింది పద్యములో:--