పుట:Andhrula Charitramu Part 2.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జంకక సుస్థిరచిత్తుడై కోపోద్దీపితమానసుడై ప్రచండతరవేదండకుండా దండంబుపగిది దేజరిల్లు నిజభుజాదండంబున మృత్యుజిహ్వాగ్రంబు ననుకరించు నట్టి మండలాగ్రంబునెత్తి ఖండింపనుద్యమింపతా బేతాళుడు వాని శౌర్యధైర్యసాహ సంబులకు మెచ్చుకొని నిజరూపముతో బ్రత్యక్షమై తనపేరు చెప్పి 'నీధైర్యంబునకు మెచ్చితి నీవుకోరినవరంబునిచ్చెద వేడు ' మనియెనట! అంత చెవిరెడ్డి తనవంశమువారికి శాశ్వతైశ్వర్యము, రాజ్యభోగము, శౌర్యధైర్యాదిగుణ సంపత్తి గలుగవలయు ననియుం, వారు యుద్ధమునకుబోవునపుడు వారికి సహకారముగా ముందు బేతాళుడు నడువవలయు ననియు గోరగా నతం డావరములనొసంగి యంతర్ధాన మందెనట! పిమ్మట జెవిరెడ్డి ధనము గైకొనుటకు బ్రయత్నించగా దనపూర్వునిచే ప్రతిస్టింపబడిన భైరవమూర్తి 'ఓయీ! ధనముగైకొన నీవర్హుడవరుదువుగాని దీనిని కొన్నిభూతములాశ్రయించుకొని యున్నవిగాన నరబలియిచ్చి గైకొనుట శ్రేయోదాయకమని చెప్పి యంతర్హత్ండ య్యెనట! అంతట నారాజు నరహత్యకు జింతించుచుండగా భైరవునిపల్కులువిన్న వాడుగావున రేచడనుమాలవాడు తన్ను బలియిచ్చి ధనము గైకొనుమని ప్రార్ధించెనట! ఇంతకాలము నిన్ను బెంచిన నే నాత్మసుఖమునకైని న్నెట్లు బలి యిత్తునని చెప్పగా రాజులధనము లోకహితమున కైనదిగాని కేవల మాత్మ సుఖ మున కైనదికాదుగాన ధర్మజ్ఞాల రయిన మీరు నాకొరినవరంబు లొసంగి నన్ను బలి యిచ్చిన మీకెంతమాత్రము దోషము ప్రసక్తింపదని రేచడు ప్రత్యుత్తర మొసంగెనట! అందులకాత డొడబడియెనట ! తనవంశమువారిని చెవిరెడ్డి వంశము వారు పోషించుచు నారిగృహములలో వివాహములు జరుగునపుడు ముందుగా దనవంశమువారికి వివాహములు జరుపవలయు నని రేచడు వర మడిగెనట ! ఆవరము నొసంగి చెవిరెడ్డి వానిని బలియిచ్చి యాధనము గైకొనియె నట ! పదంపడి యాతం డచ్చట సర్వసాపఘ్నముగా శివాలయము నిర్మించి శివప్రతిష్ట గావించెనట ! ఈ వృత్తాంతము నంతయు విని యోరుగంటి నేలుచుండిన గణపతిదేవమహారాజు చెవిరెడ్దిని రప్పించి యతని యసహాయశూరత్వమునకు