పుట:Andhrula Charitramu Part 2.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లందు బరస్పరవిరుద్ధము లనేకములు గలవు. ఇదివఱకు కున్న వేంకటగిరి వంశావళి మొదలగు గ్రంధములలోని గాధలు చరిత్రాంశములకు విరుద్ధములు గ నున్నప్పుడు విశ్వసింపకపోయిన భంగములేదుగాని యాగాధలనుమార్చి వేఱువిధంగ జెప్పుటకు కారణమేమి? పద్మనాయక చరిత్రములో మూల పురుషుడు డాజిజగన్నాధరా వని చెప్పబడియుండగా హేమద్రిరెడ్డియని నూత్నగ్రంధమున బేర్కొనియున్నారు. చెవిరెడ్డితండ్రి పోలిరెడ్డియని,

"క. ఆహామసావనాన్వయ
     దీపకుడై పోలిరెడ్ది ధృతి జనియించెన్
     ఆపుణ్యగుణనరేణ్యం
     డపున జెవిరెడ్ది గనియె నిల విమతింపన్."
    

అని పద్మనాయక చరిత్రమున గానబడుచున్నది.

      అదిజగన్నధరావు పోలిరెడ్డి నామములుగాని, హేమాద్రిరెడ్డి నామము గాని, రేచెర్లనామిరెడ్డి ఎఱ్ఱక్కసాని శాసనములలో గానరావు. ఇవన్నియు నటుండనిచ్చి యొక్క విషయమును విమర్శించి చూతము.  చెవిరెడ్డికి బేతాళనాయుడను బౌరుషనామమును గణపతిదేవు డెప్ప డొసంగెనూ నాటికి అనగా క్రీ.శ. 1202 దవ సంవత్సరమునాటికి ఎఱ్ఱక్కభర్త బేతిరెడ్ది యనియే చెప్పంబడి యుండుటచేత నంతకు బూర్వమే యీ వృత్తాంతమంతయు నడచి యుండవలయునుగదా. చెవిరెడ్డియొక్క యిట్టి ప్రసిద్ధకృత్యముల వేనిని ఎఱ్ఱక్క తన భర్తను వర్ణించు సందర్భమున వర్ణింపకుండుటకు గారణ మేమి? మఱియు వితరణకర్ణ, శాచగాంగేయ, సత్యరత్నాకర, దుష్టజనభీకర, వీరలక్షిమి ని జేశ్వర యను బిరుదమ్లను బేతిరెడ్డి వహించియుండెనని యామె శాసనముం బట్టి దెలియుచున్నది. దగా! ఇట్టి వితరణకర్ణుడు, శౌచగాంగేయుడు, దోర్బలభీముడు, రణరంగమురాముడు, శౌర్యసంపన్నుడు నైన బేతనదండనాధుడు తా నైశ్వర్య్ల సంపన్నుడై యుండియు, ప్రభువై యుండియు, తుచ్చధనమునకై తనయందు భక్తి విశ్వాసం ఉలు