పుట:Andhrula Charitramu Part 2.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కార్జునపండితారాధ్యలవారి శిష్యుడగుటచేత నితడు మొదటిప్రతాపరుద్రుని కాలముననే యున్నవాడని నిశ్చయింపదగి యున్నది. ఆంధ్రకవులచరిత్రము నందు శ్రీవీరేశలింగముపంతులవా రీతడు రెండవప్రతాపరుద్రునికాలమున నున్నవాడని పదునాఱవ శతాబ్దమునం దున్న పిడుగు సోమనారాధ్యుని వాక్యములం బురస్కరించుకొని వ్రాసియున్నాడు. ఈగ్రంధముయొక్క మొదటి ప్రకరణమునం దట్టిఅభిప్రాయమును దెలిపితినిగాని యనేక హేతువులచేత నితడు మొదటిప్రతాపరుద్రుని కాలమువా డనియే యూహింపదగి యున్నది. ఈ పాల్కురికి సోమనాధకవి గొప్పపండితుడును, వేదాంతవేత్తయు గవియుంగూడ నైయున్నాడు. ఇతదు బసవపురాణము, పండితారాధ్యచరిత్రము, అనుభవసారం, చతుర్వేదసారసూక్తులు, సోమనాధ భాష్యము, రుద్రభాష్యము, బసవరగడ, గంగోత్పత్తిరగడ, సద్గురురగడ, చెన్న మల్లుసీసములు, నమస్కారగద్యము, వృషాధిపశతకము మొదలయిన గ్రంధ ములు రచించి యున్నాడు. వీనిలో బసవపురాణము మొదలయిన గ్రంధములు రచించి యున్నాడు. వీనిలో బసవపురాణమును, పండితారాధ్య చరిత్రమును, ద్విపదకావ్యములనుగా వ్రాసియున్నాడు. ఇతని కవితాశైలి మనోహరమై యున్నది. ఇతడు స్మార్తవైష్ణవబ్రాహ్మణులకు వ్యతిరేక మైన మతమును బోధించినవాడగుటచేత నిరనిగ్రంధములు శైవులలోనెగాని ఇతర బ్రాహ్మణులలో విశేషముగా బఠింపబడుట లేదు. అరమతదూషణముభాగము లను విడిచి తక్కిన భాగములను జదివినయెడల నెట్టివారి కైన నాహ్లాద కరములుగానుండక మానవు.

      "జీవసమయస్థుల శిరములు దునిమి
        మును విష్ణుసమయుల ముక్కులు గోసి
        యద్వైతులను హతహతముగావించి
        విద్వేషబౌద్ధుల విట్టుతటమాడి
        చార్వాకవాదుల గర్వంబులణచి"

అనునిట్టివాక్యములు బసవపురాణమునం దుండుటచేతనే కాబోలును స్మార్తులును వైష్ణవులును శిరోతిని ముట్ట నొల్లకున్నారు. అయిన నాకాలము నందలి మత