పుట:Andhrula Charitramu Part 2.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గురుమల్లికార్జున పండితారాధ్యుడు.

         ఈయన పచ్చిమచాళుక్యచక్రవర్తులకడ దండనాధుడుగా నుండి సన్న్యసించి శ్రీశైలక్షేత్ర,మున మల్లికార్జునదేవుని సమ్ముఖంబున నివసించుచు ననేక శిష్యులకు వీరశైవమతమును బోధించి మతవ్యాపనమునకై వారిని దేశ దేశములకు బంపెను. ఆకాలమునం దీయనశిష్యవర్గమే కర్ణాటకాంద్రదేశము లందు వీరశైవమతమ్ను విజృంబింప జేసిరి. బసవేశ్వరుడు మొదలగువా రీయన ప్రబోధములననే  వీరశైవమతాభినివేశపరవశులై మెలంగి రని తేటపడగలదు. ఈ మహాత్మునింగూర్చియు, వేన వేలు కధలు కల్పింపబడి వీరశైవులచే సంకీర్తనము  సలుపబడుచున్నై. పాటలు బద్యములు గీర్తనములు నెల్లెడల నల్లుకొని యున్నవి.  ఈయనకు శిష్యులయెడం గల వాత్సల్యము నీయయెడల  శిష్యవర్గములకు గల భక్తియు నిరుపమానములుగ నున్నవి. ఈయన శిష్యులలో నొక్కడైన పాల్కురికి సొమనారాధ్యు డితనియాజ్ఞన్ శిరసావహించి ప్ండితారాధ్య చరిత్రముము విరచించెను. ఇందు శైవమతగురువు లైన యారాధ్యులయొక్క కధ లత్యద్భుతముగా వర్ణింపబదినవి.
                
                           పాల్కురికి సోమనాధకవి.
      పాల్కురికి సోమనారాధ్యుడు  తన పండితారాధ్యచ్రిత్రమునందు వీరసోమేశ్వరుని పుత్రుడ నని చెప్పుకొనియున్నాడు. అనుభవసారములోని దాన్ గురులింగపుత్రుడనని యీక్రింది---

"క. భృంగిరట గోత్త్రుడను గురు
      లింగతనూజుండశివకులీనుడ దుర్వ్యూ
      సంగవింర్జితచరితుడ
      జంగమలింగప్రసాద సత్ప్రాణందెన్."

   అను పద్యములో జెప్పుకొని యున్నాడు. వీరసోమేశ్వరునకు గురులింగదేవర యను నామాంతరము గలిగి యుండవచ్చును.  ఇతడు గురుమల్లి