పుట:Andhrula Charitramu Part 2.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చరిత్రములను దెలిసికొనంగోరువారికిని సంఘసంస్కరణపరాయణచిత్తులగు వారికి ముఖ్యముగా బసవపురాణమును, పండితారాధ్యచరిత్రమును బఠింప యోగ్యములుగా నుండుననుటకు సందియము లేదు.

                      కాకతిమహాదేవరాజు.
  ఇతడు కాకతిరుద్రదేవుని తమ్ములలో జ్యేష్టుడు. కాకతిప్రోలరాజు ద్వితీయ పుత్రుడు. తన యన్న యగు కాకతిరుద్రదేవుడు క్రీస్తుశకము 1196 వ సంవత్స రము వఱకు రాజ్యపరిపాలనము చేసి మృఇఒతినొందగా గాకతిమహాదేవరాజు రత్న సింహాసనారూఢుడై మూడు సంవత్సరములు మాత్రమే ప్రిపాలనము చేసెను. ఇతడు తనయన్నగారైన రుద్రదేవరాజు తండ్రిని జంపి రాజ్యము నేఱుచున్నాడను ద్వేషముచేత నతనిం జంపి రాజ్య మాక్రమించుకొనవలయు నని పలుమాఱు ప్రయత్నించెను. గాని యట్టి వైపరీత్యము గలుగకుండ మంత్రులు మొదలగువారు వారించుచుండిరి. తన్ను జంపుటకై తమ్ముడు చేయు దుండగంపుబనుల నన్నింటిని సైచి రుద్రదేవుడు వానిని క్షమించుచు వచ్చెను. అట్లు సైంచుట యుక్తము కాదని మంత్రిపురోహితాదిజనంబు లెంత నొక్కిచెప్పినను రుద్రదేవుడు వారిమాటలను బెడచెవినబెట్టి తమ్ముని నాదరించుచు వచ్చెను. తుదకు రుద్రదేవుని యనంతరము మహాదేవరాజు రాజ్యభారమున్ వహించి మూడుసంవత్సరములు మాత్రమే పరిపాలనము చేయుట సంబవవించెను.
       శాణదేశాధీశ్వరుడైన జైత్రపాలు డను యాదవరాజు తనతండ్రి సింగభూపతి కి బిమ్మట క్రీ.శ.1191 టవ సంవత్సరమున రాజ్యభారమును వహించి త్రిలింగదేశముపై దండెత్తి వచ్చెను. అప్పుడు కాకతిమహాదేవరాజు నకును జైత్రపాలునకును ఘోరయుద్ధము జరిగెను. ఆ యుద్ధమునందు కాకతి మహాదేవరాజు వీరమరణము నొందెను. కాబట్టి కాకతిరుద్రదేవుడు క్రీ.శ. 1196 వ  సంవత్సరమువ!రకును, రాజ్య్హపరిపాలనముచేసెననుట వాస్తవము. రుద్రదేవమహారాజుకాలమునగాని మహాదేవరాజుకాలమునగాని, యాంధ్రదేశరాజధాని యగు ననుమకొండ నలంకరించియున్న సేనాధిపతులలో