పుట:Andhrula Charitramu Part 2.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రుడుగాక త్రిలింగదేశమును స్వతంత్రుడై యవక్రపరాక్రంబునం ల్బరిపాలించిన మహారజాధిరా జని చెప్పుటక్ సంశయములేదు. ఈమహావీరుని పరిపాలనాకాలమున బశ్చిమచాళుక్యసామ్రాజ్యమును, ప్రావ్యచాళుక్యచోడ సామ్రాజ్యమును, అంతరించినది. త్రైలింగ్యసామ్రాజ్యము విస్తరింప నారంభించినది.

                             జైనమతాభినివేశము
                            పాపవిమోచనమర్గములు.
      పండ్రెండవశతాబ్దమునందలి వీరశైవమతవిజృంబణమునుగూర్చిన చరిత్ర మును సంగ్రహముగా గొంతవఱ కీగ్రంధముయొక్క ప్రధమప్రకరణంబున దెలిపి యున్నాడను. పశ్చిమచాళుక్యరాజధాని యగు కళ్యాణపురమున వీర బస వేశ్వడునిచే నుఇద్ధరింపబడిన శైవమతముతో గూడ జనించి మహావిప్లవము లనుగూర్చి మరల నిందు చర్వితచర్వణముగ నుదాహరింపం బడలేదు. విద్వత్కవి పండితప్రకాండు లయిన యారాధ్యబ్రాఃహ్మణులచేతను, వీరశైవ మతాభినివేశపరవశు లయిన జంగమగురుదేవలచేతను, తదీయాభిమాను లైన ప్;రభువరులచేతను, కర్ణాటకాంధ్రదేశములయందు వీరశైవమతము మాఱు మూలం సహితము విజృంభించి పరమతభయంకరంబై సహన మనుమాట లేశమునులేక వర్ధిల్లుచుండెను. ఎట్టివీరాగ్రణి కైనను వీరఘంటానివాదంబులు చెవినిబడినప్పుడొడలుకంపమెత్తి నడుంకు పుట్టించునట్టిదిగ నుండెను. అనేక క్షుద్రవర్ణములవారు వీరవైష్ణవములవలె వీరశైవము స్వీరించిరి. ఒకప్రక్కనుండి వీరవైష్ణవము మఱియొక ప్రక్కనుండి వీరశైవం ప్రబలుచుండుటచేత జైనబౌద్ధ మతములు పేరుపెంపులేక నసివాళ్లువాడుటకు బ్రారంభ మయ్యెను. అట్టి సందర్భమున రుద్రదేవుడు త్రైలింగ్యసామ్రాజ్యమును విస్తరింపజేయుచు ననుమకొండరాజధానిగ బ్రజారంజకముగ బరిపాలనము సేయుచుండెను. అందఱ కుంబోలెనే రుద్రదేవునకును మతాభిప్రాయములు మార్పుజెంద బ్రారంబించినవి. ఎందఱు శత్రురాజుల నోడించి యెంతభూమి నాక్రమించినను ఎన్ని