పుట:Andhrula Charitramu Part 2.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆ ఱ వ ప్ర క ర ణ ము

దిగ్విజయయాత్రలు గావించినను, మనస్సున కానందముకలుగనీయక యెద్ది యో పిశాచమువలె బాధించిచుచుండెను. అతడు వృద్ధిడైన తనతండ్రిని నిర్ని మిత్తముగా జంపి పితృహత్యాదోషమును ముడివెట్టుకొంటినిగదా యాపాప మెట్లు పరిహార మగు నని నిరంతరమును బశ్చాత్తాపమును బొందుచు నొకనాడు బ్రాహ్మణోత్తముల నాస్థానమునకు రప్పించి వారలతో నిట్లనియె. 'ధర్మజ్ఙానులైన భూసురోత్తముల్లర ! పితృహత్యాదొషమునుండినన్ను విముక్తునింగావించు మార్గం బెద్దియైననున్న యెడల ననుగ్రహించి దెలుపుడు ' అని మిక్కిలి పశ్చాత్తప్తచిత్తంబుతో వేడికొనియెను. అందునకు వారలు 'మహాప్రభూ ' ఎట్టివారికిన్ గర్మానుభవ మనుభవింపక తీఱదు. ఈ దేహంబునకు కర్మయే కారణం బైనయెడల నద్దానిం దెగటార్చుటకు మొక్కయుపాయంబు గలదు. అయ్యది కర్మసంహారకుండయిన శివుని నారాధించుట.' అని ప్రత్త్యుత్తర మీయ నతం డామార్గమును దెలుపుండని యడగగా వారలు మరల నిట్లనిరి. 'మహాప్రభూ ! దేశాటనము సలిపి దివ్యనదులంగ్రుంకి దివ్యతీర్ధమ్ల సేవించి దివ్య లింగమ్లను బ్రతిష్టించి పంచామృతములతో బరమేశ్వరుం డైన శివుని కభిషేకము గావించి భక్తితో సేవించిన బాపపరిహారంబగు ' నని చెప్పిరి. అంతట రుద్రదేవుడు బ్రాహ్మణులకు స్వర్ణమును దానముచేసి పంపించెను. తర్వాత రుద్రదేవుడు నూఱుగురు బ్రాహ్మణోత్తములను విశ్వేశ్వరున కభిషేకంబు జేయ నియమించి విశేషధనంబు లొసంగి గాశికిం బంపించి వారలచే బితృతర్పణంబులను దనకుగా జేయించెను. అచ్చట ననేక ధర్మకార్యంబులాచరింపంజేసెను. ఓరుగంటికి ఆఱు క్రొసులదూరమున నున్న అయినవోలు గ్రామమునందు మైలారదేవున కాలయము గట్టించి చిత్రవిత్రము లయిన నాలుగు శిలాద్వారములను నిర్మింపం జేసెను. మఱియు ననుమకొండకు రెండు క్రోసులదూరమున షిర్దిపల్లె నాలయమును నిర్మింపించి బుద్ధగణపతిని బ్రతిష్టింపించుటయేగాక మొదలిచెర్ల గ్రామంబునగూడ నొక మహాశక్తిని బ్రతిష్టింపించి యొక యాలయమును గట్టించి యేటేట నుత్సఫాలు జరుప నేర్పాటు గావించెను. శ్రీశైలమునకుబోయి మల్లికార్జునదేవుని సందర్శింది తులాఉరుష