పుట:Andhrula Charitramu Part 2.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నెచ్చటను గానరావు. అంతియగాక చాళుక్యచోడులకు ప్రతినిధులుగ బరిపాల నము సేయుచున్న మాండలిక సామంతులయొక్క శాసనములే పెక్కులు గన్పట్టుచుండుటచేత మొదటికాకతిప్రతాపరుద్రుడు వారిపై దండేత్తి యుద్ధముచేసి జయించియుండెవచ్చుంగాని యాభాగములను దన రాజ్యములో గలుపుకొని పరిపాలనము చేసియుండు నని యూహింపరాదు. 1162 వ సంవత్సరమునకు దరువాత ప్రతాపరుద్రుదేవుని శాసనముల దక్షారామమునందును, సరసారావు పేట తాలూకాలోని కుంకలగుంట గ్రామమునందును, కంద నోలిమండలములోని త్రిపురాంతకమునందును గానవచ్చుటచేత నప్పటి కాభాగములను జయించె నని స్పస్ట మగుచున్నది. దాక్షారామశాసనములోత్రిభువనచక్రవర్తివిష్ణువర్ధన మహారాజుయొక్క ప్రవర్ధమానసంవత్సరములు పేర్కొనంబడుటయేగాక 'పెనుగొండపురివరాధీశ్వర ' యని కూడ బేర్కొనంబడియెను. ఈశాసనం క్రీ.శ.1179 దవ సంవత్సరమున వ్రాయబడినది. ఈత డీశాసనమున విష్ణువర్ధన మహారాజుయొక్క విజయరాజ్యసంవత్సరము లుదాహరించుటకు గారణము గానరాదు.

     దీనినిబట్టి యితడు చాళుక్యచోడచక్రవర్తులకు సామంతు డాని యెంతమాత్రము నూహింపరాదు. నరసారావుపేటతాలూకాలోని కుంకలగుంట గ్రామములో శ్రీభోగీశ్వరస్వామివారిదేవళములోప్రతాపరుద్రునియొక్కయు అతని మంత్రి యైన బొల్లయ్య (మల్లయ్య) ప్రెగ్గడయొక్కయు నామములు మాత్రము గానబడుచున్నవిగాని తక్కినయక్షరములు తెలియంబడుచుండలేదు. ఈ శాసనము శా.శ.1119 దవ సంవత్సరమ్నకు సరియైన క్రీ.శ.1197 వ సంవత్సరమున వ్రాయబడినది. కాబట్టి యిది మొదటిప్రతాపరుద్రుని కాలము నాతి దని ప్సష్టమగుచున్నది.1 'పతిహీతచరితి ' యని యితని శాసనములలో గన్పట్టినను, ఇతడు పశ్చిమఛాళుక్య చక్రవర్తులకు గాని, ప్రాచ్యఛాళుక్యచోడచక్రవర్రులకుగాని, సామంతుడైన మహా మండలేశ్వ

1.Lists of Autiquorian Remains by R. Sewell Vol.I. b.71