పుట:Andhrula Charitramu Part 2.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కొనుచుండెడివారు. మఱియు నీజడ్జర్లశాసనమునందు గోకర్ణసింగరూకలని సిహముద్రకలుగల గొకర్ణునినాణెములు పేర్కొనబడినవి. ఈ గోకర్ణచోడుశాసన ములు హైదరాబాదు రాజ్యమునం దచ్చటచ్చట కల వని దెలియుచున్నది. ఆశాసనములన్నియు బ్రకటింపబడినమీదట గాని కందూరు వర్ధమానపురచోడు లయొక్క చరిత్రము దెలిసికొన సాధ్యముగాదు.

                          రుద్రదేని రాజ్యవిస్తారము.
   ఇట్లు రుద్రదేవుడు చాళుక్యసైన్యపాలు డయిన తైలపదేవుని, కర్ణాటకచోడు లయిన భీరుచోడోదయచోడులను, మంత్రకూటాధీశు డైన గ్ందమనాయని, తక్కుంగల శత్రురాజువర్గమును జయించి యాంధ్రదేశమునందు పశ్చిమఛాళుక్య చక్రవర్తుల పరిపాలనమునకు లోబడి యున్న భూభాగము లన్నిటిని స్వాధీనము చేసికొని మహామండలేశ్వరుడై రాజాదిరాజై పగడ్త కెక్కెను. ఇతని రాజ్యముయొక్క విస్తీర్ణ మనుమకొండశాసనములో నీక్రిందిశ్లోకమున వివరముగా జెప్పబడినది.

          "రాజ్యం ప్రాచ్యాం లవణజలధే స్తీరపర్యన్త మస్య
           శ్రీశైలాన్తం ప్రచరతి సదా దక్షిణస్యాం సమగ్రం
           ప్రాతీచ్యాన్తా కటకవికటస్థాయినీ రాజ్య్హలక్ష్మీ;
           కాబేర్యాశాతటవిలసితా మాల్యవన్తం ప్రపేదే."

అనగా క్రీస్తుశకము 1162 వ సంవత్సరమునాటికి కాకతిరుద్రదేవుని రాజ్యము తూర్పున సముద్రమువఱకును, దక్షిణమునశ్రీశైలమువఱకును, పడమర కటకము (పశ్చిమచాళుక్యరాజదానియగు కళ్యాణపురి) వఱకును, విస్తరించి యున్నదని పైశ్లోకముయొక్క భావము.

      ఈపైశ్లోకమునం జెప్పబడినకాకతిరాజ్యముయొక్క హద్దులు సరియైన వయినయెడల దూర్పున నుండు నిప్పటిగోదావరీ, కృష్ణా, గుంటూరు మండలములు పైరాజ్యమ్లో జేరి యుండవలయును. క్రీస్తుశము 1162 వ సంవత్సరమ్నకు బూర్వము బ్రతాపరుద్రునిశాసనము లామండలములలో